- Telugu News Photo Gallery Business photos 5 cars in india with most effective air condition system details in telugu
Cars: మండే వేసవిలో ప్రయాణం కూల్..కూల్.. మెరుగైన ఏసీతో వచ్చే టాప్ కార్లు ఇవే..!
భారతదేశంలో ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. ఈ ఎండల్లో ప్రయాణం అంటే పెద్ద ప్రహసనంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సౌకర్యవంతమైన ప్రయాణానికి మండే వేసవిలో సమర్థవంతమైన ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలు కలిగిన కార్లు ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా పట్టణాల్లో కార్లల్లో ప్రయాణించాలంటే సమర్థవంతమైన క్యాబిన్ కూలింగ్ అవసరం. వేడిని సులభంగా అధిగమించడానికి అత్యంత ప్రభావవంతమైన ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలను అందించే భారతదేశంలోని ఐదు కార్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
Updated on: May 15, 2025 | 3:15 PM

మారుతి సుజుకి డిజైర్ ప్రయాణికులకు సౌకర్యవంతమైన క్యాబిన్ ఉష్ణోగ్రతను నిర్వహించడానికి రూపొందించారు. కారు మొత్తం కూలింగ్ సమానంగా పంపిణీ చేయడానికి శక్తివంతమైన ఎయిర్-కూలింగ్ వ్యవస్థను ఉపయోగిస్తుంది. అదనపు సౌకర్యం కోసం ముందు, వెనుక భాగంలో వెంట్స్‌తో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఎంపిక ఈ కారు ప్రత్యేకత. ఈ కారు రెండు ఇంజన్ ఎంపికలను అందిస్తుంది. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.2 లీటర్ సీఎన్‌జీ ఇంజన్లతో అందుబాటులో ఉంటుంది. ఈ కారు ప్రామాణిక ధర రూ.6.83 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

హ్యుందాయ్ క్రెటా డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ కారులో డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్ స్వతంత్రంగా ఉష్ణోగ్రతను సర్దుబాటు చేసుకోవడానికి అనుమతిస్తుంది. క్యాబిన్ లోపల మెరుగైన గాలి నాణ్యత కోసం మల్టీ-ఎయిర్ మోడ్, ఫైన్ డస్ట్ ఇండికేటర్ వంటి లక్షణాలు ఉన్నాయి. కుడి వైపు వెంట్స్, ముందు ప్రయాణీకుల వెంట్, అంతటా గాలి ప్రవాహం కోసం వెనుక వరుస వెంట్స్‌తో వస్తుంది. ఈ కారు ధర రూ. 11.10 లక్షల (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

హెూండా అమేజ్ మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్ ఏసీ వెంట్లతో కూడిన క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్‌తో ఆకట్టుకుంటుంది. ఈ వ్యవస్థలో రీసర్క్యులేషన్, ఫ్రెష్ ఎయిర్ మోడ్స్ ఉన్నాయి. మెరుగైన గాలి నాణ్యత కోసం పీఎం 2.5 ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ఉంది. హెూండా అమేజ్ ధర రూ. 8.09 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ 700 డ్యూయల్ జోన్ సామర్థ్యాలతో కూడిన ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్‌తో ఆకట్టుకుంటుంది. ఈ కారులో డ్రైవర్‌తో కో ప్యాసింజర్ కూడా వారి ప్రాధాన్యత ప్రకారం ఉష్ణోగ్రతను సర్దుబాటు చేసుకోవచ్చు. అదనపు సౌలభ్యం కోసం ఈ ఎస్‌యూవీ ముందు భాగంలో వెంటిలేటెడ్ సీట్లతో వస్తుంది. ఈ కారు రెండు ఇంజన్ ఎంపికలతో వస్తుంది. 2.0-లీటర్ పెట్రోల్, సీఆర్‌డీఈతో కూడిన 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌తో ఆకట్టుకుంటుంది. ఈ కారు ప్రారంభ ధర రూ.14.49 లక్షలు (ఎక్స్-షోరూమ్).

టాటా హారియర్ డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్‌తో ఆకట్టుకుంటుంది. ఈ కారులో డ్రైవర్, ఫంట్ సీట్ ప్యాసింజర్‌కు కస్టమైజ్డ్ ఉష్ణోగ్రత సెట్టింగ్‌ను అనుమతిస్తుంది. ఈ ఎస్‌యూవీ క్యాబిన్ లోపల మెరుగైన గాలి నాణ్యత కోసం ఏక్యూఊ డిస్ప్లేతో కూడిన ఎయిర్ ప్యూరిఫైయర్ను అందిస్తుంది. టాటా హారియర్ రూ. 14.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో కొనుగోలు చేయవచ్చు.




