- Telugu News Photo Gallery Best Smart TVs Under Rs 12,500 to buy on Amazon and Flipkart Sale, Check Details
Smart TV: కొత్త టీవీ కొంటున్నారా.. రూ.12వేల లోపు దొరికే 5 బెస్ట్ టీవీలు ఇవే..
దసరా, దీపావళి పండుగ సందర్భంగా మీరు కొత్త టీవీ కొనాలని అనుకుంటున్నారా..? అయితే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్‌లో సూపర్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో రూ.12వేల కంటే తక్కువ ధరకే లభించే 5 బెస్ట్ స్మార్ట్ టీవీల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
Updated on: Sep 23, 2025 | 11:06 AM

శామ్‌సంగ్ 32-అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.10,990. ఈ టీవీలో HDR 10+ సపోర్ట్, వాయిస్ అసిస్టెంట్, PurColor టెక్నాలజీ ఉన్నాయి. దీనికి Samsung Knox భద్రత కూడా ఉంది.

LG 32 ఇంచెస్ టీవీ రూ.11,990కే అందుబాటులో ఉంది. ఈ LG టీవీ Alpha5 Gen 6 AI ప్రాసెసర్, HDR, డాల్బీ ఆడియోతో వస్తుంది. DTS Virtual:X సౌండ్ టెక్నాలజీతో థియేటర్ అనుభవాన్ని ఇస్తుంది.

టీసీఎల్ 32 ఇంచెస్ టీవీ ధర రూ.12,490గా ఉంది. ఈ QLED టీవీ 100శాతం కలర్ వాల్యూమ్, 24W డాల్బీ ఆడియోతో అద్భుతమైన విజువల్స్, సౌండ్ అందిస్తుంది. ఇది గూగుల్ అసిస్టెంట్‌తో కూడా పనిచేస్తుంది.

థామ్సన్ ఫీనిక్స్ 32 ఇంచెస్ టీవీ రూ.9,499కే అందుబాటులో ఉంది. తక్కువ బడ్జెట్‌లో లభించే ఈ టీవీ 48W సౌండ్ అవుట్‌పుట్‌తో థియేటర్ లాంటి సౌండ్ అందిస్తుంది. దీని ఆండ్రాయిడ్ సపోర్ట్ ద్వారా మీరు అన్ని OTT యాప్‌లను ఉపయోగించవచ్చు.

షావోమీ 32 ఇంచెస్ టీవీ ఈ స్మార్ట్ టీవీ ధర రూ.11,499గా ఉంది. ఇది 200+ ఉచిత ఛానెల్‌లు, HDR10 సపోర్ట్, డాల్బీ ఆడియోతో వస్తుంది. దీని ప్రీమియం మెటల్ బెజెల్-లెస్ డిజైన్ ఇంటికి స్టైలిష్ లుక్ ఇస్తుంది. ఈ దీపావళి సీజన్‌లో ఈ టీవీలు కొనుగోలు చేయడానికి మంచి అవకాశం.




