Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Curry Leaves Benefits : కరివేపాకుని ఇలా తింటే కలిగే బెనిఫిట్స్‌ మీరు అస్సలు ఊహించలేరు..

ఆహార రుచిని పెంచడానికి అనేక పదార్థాలను ఉపయోగిస్తారు. భారతీయ వంటగదిలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు ఆహార రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. సాధారణంగా దాదాపు అందరూ ఉపయోగించే పదార్థాలలో కరివేపాకు ఒకటి. ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కరివేపాకు తినడం వల్ల ఆరోగ్యం, అందానికి కలిగే ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. కరివేపాకు తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరిగి ఐరన్ లోపం తగ్గుతుంది. ఇందులో ఎన్నో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని ఆహారంలో తీసుకుంటే చాలా లాభాలున్నాయి. పచ్చి కరివేపాకుని నమిలితే ఏమవుతుందో తెలుసా..?

Jyothi Gadda

|

Updated on: Mar 12, 2025 | 10:04 AM

బరువు తగ్గడానికి, జీర్ణక్రియ బాగా ఉండటం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో, కరివేపాకు మీ జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో గుండె సంబంధ సమస్యలు తగ్గి హార్ట్ హెల్త్ బాగుంటుంది.

1 / 5
కరివేపాకు నమలడం వల్ల ఇది ఆమ్లతను తగ్గించడం, జీర్ణ ఎంజైమ్‌లను పెంచడం ద్వారా జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం చికిత్సకు కూడా సహాయపడుతుంది. అంతేకాదు.. కరివేపాకులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది దంతాలు, ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

2 / 5
కరివేపాకు తినడం వల్ల కీళ్ళనొప్పులు, షుగర్ ఉన్నవారిలో ఎముకలని నొప్పిని తగ్గించి ఎముకల్ని బలంగా మారుస్తుంది. కరివేపాకులో ఫాస్పరస్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, దీనిని తీసుకోవడం వల్ల డీటాక్సీఫైయర్‌లా పనిచేస్తుంది. కరివేపాకులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది. దీంతో మలబద్ధకం సమస్య దూరమవుతుంది.

3 / 5
జుట్టు రాలడానికి కారణం కుదుళ్ళు ఆరోగ్యంగా లేకపోవడమే.. ఇందుకు ప్రోటీన్ లోపం, ఐరన్ లోపం. ఈ రెండు లోపాల కారణంగా జుట్టు రాలుతుంది. అయితే, కరివేపాకు తింటే ఈ సమస్యలు దూరమవుతాయి. కరివేపాకులో విటమిన్ బి12, విటమిన్ ఇ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.

4 / 5
కరివేపాకులో కేలరీలు తక్కువగా ఉంటాయి, కానీ విటమిన్లు A, B, C, E వంటి ముఖ్యమైన పోషకాలతో పాటు కాల్షియం, ఇనుము వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు..కరివేపాకులోని సువాసన, ప్రశాంతమైన సమ్మేళనాల కారణంగా ఒత్తిడిని తగ్గించడంలో చాలా సహాయపడతాయి.

5 / 5
Follow us