ఇదేం కాంబినేషన్ అనుకుంటే పొరపాటే.. అరటిపండులో నల్ల మిరియాల పొడి మిక్స్ చేసి తింటే..
ప్రకృతిలో లభించే కొన్ని పదార్థాలు ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలను కలిగి ఉంటాయి. అవి మనకు సరిగ్గా అందలంటే.. ఎప్పుడు ఏం తినాలో తెలుసుకుంటే చాలు..అరటిపండు, నల్లమిరియాల కాంబినేషన్ అందులో ఒకటి. ప్రతి రోజూ ఉదయాన్నే నల్లమిరియాలు, అరటిపండ్లు కలిపి తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఆయుర్వేద వైద్యంలో బెస్ట్ హోం రెమెడీగా నిపుణులు చెబుతున్నారు.. ఈ చిట్కాను సూపర్‌ఫుడ్ అని కూడా అంటారు. మీరు ఈ చిట్కాను ఒక నెల పాటిస్తే చాలు.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మెరుగైన జీర్ణక్రియతో పాటు మరికొన్ని అద్భుతమైన ప్రయోజనాలు కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం...
Updated on: Jan 26, 2025 | 3:37 PM

రోగనిరోధక శక్తి: మిరియాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. జలుబు, దగ్గు, ఫ్లూ నుండి రక్షణను అందిస్తుంది.

చాలా మంది రోజుకు కనీసం ఒక అరటిపండు తింటుంటారు. ఇందులో పొటాషియం, ఐరన్, కాల్షియం, నియాసిన్, మెగ్నీషియం, రిబోఫ్లేవిన్, విటమిన్ బి6 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీని రెగ్యులర్ వినియోగం ఆకలిని తగ్గిస్తుంది. అతిగా తినడాన్ని నివారిస్తుంది. ఇది శరీర బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇందులో కాల్షియం అధికంగా ఉండటం వల్ల, ఇది ఎముకలు, దంతాల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మలబద్ధకం, జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

జీర్ణశక్తిని బలపరుస్తుంది: అరటిపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మిరియాలు ఎంజైమ్‌ల విడుదలను పెంచుతాయి. ఫలితంగా జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలకు ఇది మంచి మందు.

ఈ రెండు పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ఫైబర్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో సమృద్ధిగా ఉండటం వలన ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కానీ తక్కువ కేలరీలు కలిగిన, బరువు నియంత్రణకు సహాయపడే పండు కోసం మీరు చూస్తున్నట్లయితే మాత్రం జామ మంచి ఎంపిక. కానీ అరటిపండు శరీర శక్తికి మంచి ఎంపిక. వ్యాయామానికి ముందు లేదా తర్వాత ఈ పండును తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది.

నల్ల మిరియాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజూ రెండు నల్ల మిరియాల గింజలు తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. నల్ల మిరియాలు తీసుకోవడం వల్ల కీళ్ళు, అన్నవాహిక వాపు తగ్గుతుంది. నల్ల మిరియాలు వాత దోషాన్ని తొలగిస్తాయి. శరీరం నుండి విషాన్ని తొలగిస్తాయి.





























