Health Tips: చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే అద్భుతమైన బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్..!
మన శరీరంలో కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మంచి కొలెస్ట్రాల్ (HDL), మరొకటి చెడు కొలెస్ట్రాల్ (LDL). చెడు కొలెస్ట్రాల్ (LDL) రక్తనాళాలను నిండిపోయేలా చేసి రక్త ప్రవాహాన్ని గుండెకు చేరకుండా చేస్తుంది. ఇది గుండె సంబంధిత సమస్యలు, స్ట్రోక్‌లకు కారణమవుతుంది. అయితే మంచి బ్రేక్‌ఫాస్ట్ తినడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. రాత్రంతా ఉపవాసంలో ఉన్న శరీరానికి ఉదయాన్నే మంచి ఆహారం అందిస్తే త్వరగా బాడీ అబ్జార్వ్ చేసుకుంటుంది.
Updated on: Jan 26, 2025 | 3:41 PM

సాల్మన్ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అదనంగా ట్రైగ్లిజరైడ్ల స్థాయిలను కూడా తగ్గిస్తాయి. వీటిని డైట్‌లో చేర్చడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చసొనతో గుడ్లను తీసుకోవడం చాలా ఆరోగ్యకరం. అలాగే పాలకూర వంటి ఆకుకూరలు, ఫైబర్ పుష్కలంగా ఉన్నవి మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని ప్రోటీన్, ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి గుండె సమస్యల్ని తగ్గిస్తాయి.

ఓట్స్ పీచు పదార్థాలకు అద్భుతమైన మూలం. ఇందులోని ఫైబర్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి బయటికి పంపుతుంది. దీనిని మసాలా ఓట్స్ లేదా పాలతో కలిపి తినవచ్చు. రోజూ ఓట్స్‌ను ఆహారంలో చేర్చడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడేందుకు సహాయపడుతుంది.

పాలతో తయారైన పనీర్ కూడా కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిని చపాతీ పిండిలో కలిపి పరాఠాలుగా లేదా కూరల్లో ఉపయోగించి తినవచ్చు.

రాత్రి బాదాన్ని నానబెట్టి ఉదయాన్నే తినడం చాలా ఆరోగ్యకరం. హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధనల ప్రకారం.. ప్రతిరోజూ బాదం తినడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ 5 శాతం తగ్గుతుంది. బాదం రక్తంలోని మలినాలను కూడా తగ్గిస్తుంది.

నారింజ, లెమన్ వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను 7.5 శాతం నుంచి 12 శాతం వరకు తగ్గిస్తాయి. వీటిని డైలీ డైట్‌లో చేర్చుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.




