- Telugu News Photo Gallery Avoid these habits to overcome from heart attack problems Telugu Health News
Heart Attack: గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా.? అయితే వెంటనే ఈ అలవాట్లను మానేయండి.. లేదంటే మూల్యం చెల్లించక తప్పదు..
Heart Attack: ప్రస్తుత రోజుల్లో హార్ట్ ఎటాక్ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. గుండె సంబంధిత రోగాలకు తీసుకునే ఆహారమే ప్రధాన కారణం. కొన్ని రకాల అలవాట్లకు దూరంగా ఉంటే హృదయ సంబంధిత రోగాలకు దూరంగా ఉండొచ్చు. అవేంటంటే..
Updated on: Sep 06, 2022 | 6:55 AM

ప్రస్తుతం హృద్రోగుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. చూడడానికి ఎంతో పటిష్టంగా ఉన్న వ్యక్తి అయినా క్షణాల్లో కుప్పకూలి పోయేలా చేస్తుంది గుండె వ్యాధుల. అయితే హృదయ సంబంధిత రోగాలకు మన అలవాట్లే కారణాలు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ అలవాట్లను మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

స్మోకింగ్‌తో పాటు డ్రింకింగ్ అలవాటు కూడా గుండెకు చేటు చేస్తుంది. మద్యపానం వల్ల బీపీ పెరగడం వెరసి గుండెకు హాని కలిగిస్తాయి. కాబట్టి మద్యం గుండెకు కీడు చేస్తుందని గుర్తించాలి.

ఇక గుండె ఆరోగ్యానికి చేటు చేసే వాటిలో కూల్ డ్రింక్స్ కూడా ఒకటి. వీటిలో ఉండే సోడా కారణంగా గుండె ఆరోగ్యం దెబ్బ తింటుంది. రెగ్యులర్‌గా కూల్‌డ్రింక్స్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.

నూనె ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది కాల క్రమేణా గుండెపోటకు దారి తీస్తుంది. కాబట్టి ఆయిల్ ఫుడ్‌కు వెంటనే ఫుల్‌స్టాప్ పెట్టేయండి.

ప్రాసెస్ చేసిన మాంసం గుండెకు కీడు చేస్తుంది. ఇందులో ఎక్కువగా ఉండే ఉప్పు అధిక రక్త పోటుకు దారి తీస్తుంది. దీంతో గుండె పోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వచ్చిన వెంటనే అడిగే ప్రశ్న స్మోకింగ్ అలవాటు ఉందా.? అవును హృద్రోగ సమస్యలకు ప్రధాన కారణం పొగాకు. ఈ అలవాటు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు.





























