- Telugu News Photo Gallery Are you using these tablets for libido during lovemaking then how know it can damage your health
ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా ?? శృంగారంలో రనౌట్ అవ్వడం ఖాయం..
వైద్యుల సలహా తీసుకోకుండా సొంతంగా మందులు వాడేవారు అనేక సమస్యల బారిన పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల మెడిసిన్స్ వ్యక్తుల శృంగారాన్ని లైంగిక సామర్థ్యం తగ్గిస్తున్నాయని వైద్య నిపుణులు గుర్తించారు.
Updated on: Apr 11, 2023 | 12:28 PM

వైద్యుల సలహా తీసుకోకుండా సొంతంగా మందులు వాడేవారు అనేక సమస్యల బారిన పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల మెడిసిన్స్ వ్యక్తుల శృంగారాన్ని లైంగిక సామర్థ్యం తగ్గిస్తున్నాయని వైద్య నిపుణులు గుర్తించారు.

పెయిన్‌కిల్లర్లు: పెయిన్‌కిల్లర్లలో అనేక రకాలు ఉంటాయి. ఎలాంటి నొప్పినైనా దూరం చేయగలిగే శక్తి వీటికి ఉంటుంది. అయితే పెయిన్‌కిల్లర్ల వాడకం పెరిగితే, లైంగిక సామర్థ్యం తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. అందుకే వైద్యుల సలహా ప్రకారం, అవసరమైన మోతాదులోనే వీటిని వాడాలి.

యాంటీ డిప్రెసెంట్స్: డిప్రెషన్‌కు చికిత్స చేయడానికి ఈ మందులను ఉపయోగిస్తారు. అయితే వీటిని లిబిడో కిల్లర్స్ అని పిలుస్తారు. సెక్స్‌పై ఆసక్తి కోల్పోవడం, భావప్రాప్తి కలగకపోవడం, స్ఖలన సమస్యలు, కొన్నిసార్లు అస్సలు స్ఖలనం కాకపోవడం, పురుషులలో అంగస్తంభన లోపం.. వంటివి యాంటీ డిప్రెసెంట్స్ వల్ల ఎదురయ్యే సెక్సువల్ సమస్యలు.

బర్త్ కంట్రోలింగ్ పిల్స్: పిల్లలు పుట్టకుండా, గర్భాన్ని వాయిదా వేసే మాత్రలు మహిళల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి.

స్టాటిన్స్, ఫైబ్రేట్స్: ఈ మందులను ప్రధానంగా అధిక కొలెస్ట్రాల్ చికిత్సకు ఉపయోగిస్తారు. అయితే వీటివల్ల సెక్స్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోవచ్చు. ఈ మెడిసిన్స్ టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్, ఇతర సెక్స్ హార్మోన్ల ఉత్పత్తిలో జోక్యం చేసుకోవచ్చు. పురుషుల్లో అంగస్తంభన సమస్యలకు ఇవి కారణమవుతాయని అధ్యయనాలు నిర్ధారణకు వచ్చాయి.

బెంజోడియాజిపైన్స్-ట్రాంక్విలైజర్స్: బెంజోడియాజిపైన్స్ అనేవి మత్తుమందులు. ఆందోళన, నిద్రలేమి, కండరాల నొప్పులకు చికిత్స చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. ఈ మందులు వాడేవారిలో సంభోగంలో సంతృప్తి లేకపోవడం, స్ఖలన, అంగస్తంభన సమస్యలు వంటి దుష్ప్రభావాలు ఎదురుకావచ్చు. ఇవి టెస్టోస్టెరాన్ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం కలిగిస్తాయి.

బీపీ మెడిసిన్: అధిక రక్తపోటుతో బాధపడేవారు శృంగార జీవితాన్ని ఆస్వాదించలేకపోవచ్చు. అయితే హై-బీపీకి చికిత్స చేసేందుకు వాడే మందులు లైంగిక సమస్యలను పెంచుతాయి. ఈ మందులు వాడే పురుషుల్లో లైంగిక కోరికలు తగ్గడం, అంగస్తంభన సమస్యలు ఎదురుకావచ్చు. స్త్రీలలో యోని పొడిబారడం, సెక్స్ కోరికలు తగ్గడం, భావప్రాప్తి పొందడంలో ఇబ్బందులకు ఇవి కారణమవుతాయి.

యాంటీహిస్టామైన్లు: తుమ్ములు, ముక్కు కారడం వంటి అలర్జీ సంబంధిత లక్షణాలను నియంత్రించడానికి ఈ మందులను ఉపయోగిస్తారు. ఇవి తరచుగా వాడే పురుషులు అంగస్తంభన లేదా స్ఖలన సమస్యల బారిన పడవచ్చు. మహిళల్లో యోని పొడిబారడం, ఇతర సమస్యలు కనిపించవచ్చు.




