చెమటలు ఎక్కువగా వస్తున్నాయా.? ఆ వ్యాధి కావచ్చు.. జర పైలం..
శరీరంలో ఉండే వేడి తగ్గించడానికి కూడా చెమటలు పట్టాలి. చెమటలు ఎక్కువగా రావడం వల్ల చర్మానికి సహజంగానే మెరుపు కూడా వస్తుంది. చెమటలు పట్టకపోయినా ఇబ్బందే. అలాగని మరీ ఎక్కువగా చెమటలు పట్టినా కాస్త అనుమానించాల్సిన విషయమే. కొంత మందికి ఫ్యాన్ తిరుగుతున్నా.. ఏసీలో ఉన్నా కూడా చెమటలు పడుతూ ఉంటాయి. శరీరాక శ్రమ లేకుండా చెమటలు పట్టడం ఆరోగ్యానికి అస్సలు మంచిది. దీని వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. శరీరంలో చెమటను తొలగించే గ్రంథులు అతిగా పని చేయడం వల్ల ఈ సమస్య వస్తుంది. మరి అధికంగా చెమట ఎందుకు పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Sep 01, 2025 | 1:20 PM

కొంత మందికి విపరీతంగా చెమటలు పడుతూ ఉంటాయి. వేసవి కాలంలో అందరికీ ఉక్క పోస్తుంది. శరీరానికి చెమటలు పట్టడం మంచిదే. శరీరంలో ఏమైనా మలినాలు, విష పదార్థాలు ఉంటే అవి చెమట ద్వారా బయటకు పోతాయి. శరీరంలో ఉండే వేడి తగ్గించడానికి కూడా చెమటలు పట్టాలి. చెమటలు ఎక్కువగా రావడం వల్ల చర్మానికి సహజంగానే మెరుపు కూడా వస్తుంది. చెమటలు పట్టకపోయినా ఇబ్బందే. అలాగని మరీ ఎక్కువగా చెమటలు పట్టినా కాస్త అనుమానించాల్సిన విషయమే.

ఈ వ్యాధి కారణం కావచ్చు: మీకు అధికంగా చెమట పడితే అది ‘హైపర్ హైడ్రోసిస్’ ఉందని చెప్పొచ్చు. దుర్వాసనతో కూడిన చెమట పడుతుంది. చెమట బాగా చెడు వాసన వస్తుంది. దీనికి తోడు బ్యాక్టీరియా తోడైతే.. మరింత దుర్గంధ భరితం అవుతుంది. కాబట్టి వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.

ఏం చేయాలి: ఈ చెమట సమస్యను అధిగమించాలంటే.. ఎక్కువ సార్లు స్నానం చేస్తూ ఉండాలి. దీని వలన ఫ్రెష్‌గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. వదులుగా ఉండే దుస్తులను ధరించాలి. అధిక చెమట సమస్యతో బాధ పడేవారు సాధారణ సబ్బులు కాకుండా మెడికేటెడ్ సబ్బులు వాడాలి.

నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి: అధికంగా చెమట సమస్యతో ఇబ్బంది పడేవారు నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. నీటిని ఎక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. బాడీ కూడా హైడ్రేట్‌గా ఉంటుంది.

ధనియా వాటర్: అధిక చెమట తగ్గాలంటే.. ధనియాల నీరు ఎంతో చక్కగా పని చేస్తుంది. రాత్రంతా నీటిలో నానబెట్టి.. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల చెమట ఎక్కువా పట్టదు. ఖాళీ కడుపుతో ప్రతి రోజూ 5 నానబెట్టిన ఎండు ద్రాక్ష తిన్నా చెమట దుర్వాసన రాకుండా ఉండటమే కాకుండా చెమట ఎక్కువగా పట్టకుండా ఉంటుంది. తీపి ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటే చెమట ఎక్కువగా పట్టదు.




