- Telugu News Photo Gallery Are the sinuses bothering you? Check easily with these tips, Check Here is Details
Get rid of Sinuses: సైనస్ బాగా ఇబ్బంది పెడుతుందా.. ఈ చిట్కాలతో ఈజీగా చెక్ పెట్టొచ్చు!
ఈ మధ్య కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో సైనస్ కూడా ఒకటి. సైనస్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి. సైనస్ అనేది దీర్ఘకాలిక వ్యాధిగా చెప్పొచ్చు. అయితే ఈ చిట్కాలతో కొంత మేర కంట్రోల్ చేసుకోవచ్చు..
Updated on: Dec 04, 2024 | 3:14 PM

సైనస్ అనేది అలెర్జీల కారణంగా వస్తుంది. దుమ్ము, ధూళి, వైరస్, బ్యాక్టీరియాల కారణంగా సైనస్ వస్తుంది. సైనస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి. ఒక్కసారి వచ్చిదంటే తగ్గించుకోవడం చాలా కష్టం. అందులో ఈ చలి కాలంలో ఈ వ్యాధి తీవ్రత మరింతగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది సైనస్ బారిన పడుతన్నారు.

ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియాల కారణంగా ఈ సైనస్ ఎటాక్ చేస్తుంది. ఈ సైనస్ సమస్య నుంచి బయట పడటానికి చాలా మంది ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇంటి చిట్కాలతో కూడా ఈ సమస్యలను ఈజీగా పరిష్కరించుకోవచ్చు.

ముందుగా సైనస్ నుంచి బయట పడాలంటే మీరు పరిశుభ్రంగా ఉండాలి. అలాగే మీరు ఉండే గది కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోండి. దుమ్ము, ధూళి వంటివి ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఎప్పుడూ మాస్క్ ధరించడం మేలు.

కరివేపాకు, ముల్లంగి, మిరియాలు, ఆవాలు.. సైనస్ ముప్పును తగ్గించడంలో చాలా చక్కగా సహాయ పడతాయి. వీటన్నింటినీ కలిపి నీటిలో వేసి మరిగించి.. ఆ వాసన పీల్చుతూ ఉంటే.. సైనస్ సమస్యను కంట్రోల్ చేయవచ్చు.

అతే విధంగా యూకలిప్టస్ లేదా మెంతాల్ వంటి గాఢత గల ఆయిల్స్‌ని కూడా నీటిలో మరిగించి వాసన పీల్చుతూ ఉంటే.. మంచి ఫలితం ఉంటుంది. వీటీని నీటిలో కలిపి స్నానం చేసినా పర్వాలేదు. ఇంట్లో మూలల్లో కూడా ఈ నూనెలను స్ప్రే చేయండం వల్ల సైనస్ వ్యాధి తీవ్రతను తగ్గించుకోవచ్చు.

సైనస్‌ను కంట్రోల్ చేయడంలో పలు రకాల వ్యాయామాలు కూడా చక్కగా హెల్ప్ చేస్తాయి. కొన్ని రకాల ఆసనాలు వేయడం వల్ల సైనస్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. అదే విధంగా ద్రాక్ష పండు విత్తనాలను ఎండలో ఎండబెట్టి పొడిగా చేసుకుని ముక్కు ద్వారా పీల్చితే సూక్ష్మ జీవులు వంటివి పోతాయి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




