Anti-aging Tips: 50లలో కూడా చర్మం యవ్వనంగా మెరిసిపోవాలంటే ఈ ఐదు టిప్స్ ఫాలో అవ్వండి..
ముప్పైలోకి అడుగుపెట్టిన తర్వాత సహజంగానే చర్మంపై వృద్ధాప్య ఛాయలు ఏర్పడతాయి. అయితే యవ్వనంగా కనిపించడానికి అనేక మంది మార్కెట్లో దొరికే ఎన్నో సౌందర్య ఉత్పత్తులు వినియోగిస్తుంటారు. కానీ అవి కొన్నిసార్లు మీ చర్మంపై దుష్ప్రభావాలను కలిగిస్తాయి. కాబట్టి సహజమైన మార్గాల్లో చర్మం వృద్ధాప్యాన్ని నివారించడం అవసరం. 30 ఏళ్లు దాటినా చర్మ సంరక్షణపై తగు జాగ్రత్తుల తీసుకోకుంటే ముఖాల్లోనే వృద్ధాప్య సంకేతాలు స్పష్టం..
Updated on: Nov 03, 2023 | 1:21 PM

ముప్పైలోకి అడుగుపెట్టిన తర్వాత సహజంగానే చర్మంపై వృద్ధాప్య ఛాయలు ఏర్పడతాయి. అయితే యవ్వనంగా కనిపించడానికి అనేక మంది మార్కెట్లో దొరికే ఎన్నో సౌందర్య ఉత్పత్తులు వినియోగిస్తుంటారు. కానీ అవి కొన్నిసార్లు మీ చర్మంపై దుష్ప్రభావాలను కలిగిస్తాయి. కాబట్టి సహజమైన మార్గాల్లో చర్మం వృద్ధాప్యాన్ని నివారించడం అవసరం. 30 ఏళ్లు దాటినా చర్మ సంరక్షణపై తగు జాగ్రత్తుల తీసుకోకుంటే ముఖాల్లోనే వృద్ధాప్య సంకేతాలు స్పష్టం కనిపిస్తాయి.

ముడతలు పడిన చర్మం, సన్నని గీతలు, మచ్చలు ఇవన్నీ చర్మం వృద్ధాప్యానికి సంకేతాలు. రూపాయి ఖర్చులేకుండా ఇంట్లోనే సహజపద్ధతుల్లో ఈ సమస్యలు సులభంగా నివారించవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. చర్మంతో ఆరోగ్య సంరక్షణకు నిత్యం కొంచెం సమయం వ్యాయామం చేయడం జీవనశైలిలో భాగంగా అలవర్చుకోవాలి.

మన చర్మంలో ప్రతిరోజూ కొన్ని చర్మ కణాలు చనిపోయి కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. చనిపోయిన మృత కణాలు చర్మం ఉపరితలంపై పేరుకుపోతాయి. దీనితోపాటు ప్రతిరోజూ దుమ్ము - ధూళి వల్ల చర్మంపై మరింత మురికి పేరుకుపోతుంది. దీని వల్ల చర్మం డల్ గా మారి క్రమంగా వృద్ధాప్య లక్షణాలు కనపడతాయి.

చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలంటే ఎక్స్‌ఫోలియేషన్ కూడా ముఖ్యం. చక్కెర, కాఫీ లేదా శెనగపిండితో చేసిన స్క్రబ్‌ని ఉపయోగించవచ్చు. ఇది చర్మంలోని మురికిని, మృతకణాలను తొలగించి చర్మకాంతిని పునరుద్ధరిస్తుంది. అలాగే చర్మంపై ఎంత తక్కువ రసాయనాలు ఉపయోగిస్తే అంత మంచిది. సౌందర్య సాధనాల నిరంతర ఉపయోగం చర్మం స్థితిస్థాపకతను కోల్పోయేలా చేస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దోసకాయ, తేనె, పాలు వంటి సహజ పదార్థాలతో చర్మాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవాలి.

కేవలం కాస్మోటిక్స్ ఉపయోగించడం లేదా ఫేషియల్ చేయడం వల్ల చర్మం మెరుగ్గా ఉండదు. ఆహారం కూడా మార్చుకోవాలి. ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. క్యారెట్, గ్రీన్ టీ, సీఫుడ్, నట్స్ వంటి ఆహారాలు చర్మాన్ని సంరక్షిస్తాయి.





























