- Telugu News Photo Gallery Anti Aging Fruits: These 5 fruits contains vitamin c and helps to reduce weight
Anti Aging Fruits: పొట్ట కొవ్వును వేగంగా తగ్గించే పండ్లు.. వీటిని తింటే నవ యవ్వనం మీసొంతం
నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న జీవన శైలి సమస్యల్లో అధిక బరువు ఒకటి. హఠాత్తుగా బరువు పెరగడం వెనుక నిర్దిష్ట కారణాల్లో.. విటమిన్ లోపం ప్రధాన కారణమని పరిశోధనలు చెబుతున్నాయి. అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. మానవ శరీరంలో విటమిన్ సి లోపం బరువు పెరుగుటకు దారితీస్తుందని 2005లో తెలిపింది..
Updated on: Aug 18, 2024 | 12:56 PM

నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న జీవన శైలి సమస్యల్లో అధిక బరువు ఒకటి. హఠాత్తుగా బరువు పెరగడం వెనుక నిర్దిష్ట కారణాల్లో.. విటమిన్ లోపం ప్రధాన కారణమని పరిశోధనలు చెబుతున్నాయి. అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. మానవ శరీరంలో విటమిన్ సి లోపం బరువు పెరుగుటకు దారితీస్తుందని 2005లో తెలిపింది.

అందువల్ల ఫిట్ లుక్ పొందాలంటే ప్రతిరోజూ విటమిన్ సి ఉన్న ఆహారాన్ని అధికంగా తినాలి. ముఖ్యంగా ఈ కింది పండ్లు తీసుకుంటే బరువు సులువుగా తగ్గుతారు. పైగా నవ యవ్వనం మీసొంతం అవుతుంది కూడా. పైనాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆహారం జీర్ణం కావడానికి బాగా సహాయపడుతుంది. ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో మంటను తగ్గిస్తుంది. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. బొప్పాయిలోని ఈ గుణం శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో ఈ ఫ్రూట్ కాంబినేషన్ బలేగా సహాయపడుతుంది. బరువు కూడా తగ్గొచ్చు.

కివి.. అధిక ఫైబర్ పండు. అన్ని సీజన్లలో అందుబాటులో ఉంటుంది. ఫైబర్ బరువు తగ్గడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. కివీలోని విటమిన్ సి గుండె జబ్బుల ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

జామపండు విటమిన్ సి మాత్రమే కాకుండా ఖనిజాలు, పొటాషియం, ఇతర మూలకాలను కలిగి ఉన్న పండు. ఇది శరీర పోషణలో ఎంతో సహాయపడుతుంది.

స్ట్రాబెర్రీలను రోజువారీ ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. స్ట్రాబెర్రీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర నియంత్రణలో సహాయపడుతుంది.




