Curry Leaf Oil: రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారా.. చింతేలా కరివేపాకు ఉందిగా అండగా..
భారతీయ వంటకాల్లో సుగంధ ద్రవ్యాలు ముఖ్యపాత్ర వహిస్తాయి. ఇవి ఆహారానికి రుచి, వాసనను అందిస్తాయి. అంతేకాకుండా అనేక ఆరోగ్య లక్షణాలు కలిగి ఉంటాయి. కరివేపాకును అనేక రకాల వంటలలో ఉపయోగిస్తారు. దీనిని వంటల్లో వేయడం వల్ల మంచి సువాసన, రుచి పెరుగుతుంది. ఇది వంటలకు కొత్తరూపు తీసుకువస్తుంది.
Prudvi Battula | Edited By: Narender Vaitla
Updated on: Jul 20, 2023 | 4:44 PM

భారతీయ వంటకాల్లో సుగంధ ద్రవ్యాలు ముఖ్యపాత్ర వహిస్తాయి. ఇవి ఆహారానికి రుచి, వాసనను అందిస్తాయి. అంతేకాకుండా అనేక ఆరోగ్య లక్షణాలు కలిగి ఉంటాయి. కరివేపాకును అనేక రకాల వంటలలో ఉపయోగిస్తారు. దీనిని వంటల్లో వేయడం వల్ల మంచి సువాసన, రుచి పెరుగుతుంది. ఇది వంటలకు కొత్తరూపు తీసుకువస్తుంది.

కరివేపాకు నూనె.. ఒరేగానో ఆయిల్, బాసిల్ ఆయిల్ వంటి ఇతర హెర్బ్ ఆయిల్‌ల వలె కరివేపాకు ఆయిల్ కూడా ప్రసిద్ధి చెందింది. ఇది మీ వంటకాలకు తాజా వాసన, రుచిని అందిస్తుంది. అదనంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. విరేచనాలు, మలబద్ధకం, వంటి కడుపు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

కరివేపాకులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను దూరం చేస్తుంది. ఈ నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తాజా కరివేపాకు ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం అదుపుల ఉంటుంది. బరువు తగ్గడంలో కూడా తోడ్పడుతుంది.

కరివేపాకు నూనెను ఎలా ఉపయోగించాలి.. ఆహారంలో రుచి, వాసన కోసం వంట నూనెలో మూలికలను కలుపుతారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కరివేపాకు నూనెను ఉపయోగించడం వల్ల మీ రెగ్యులర్ భోజనం మరింత రుచికరంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

ఇంట్లో కరివేపాకు నూనె ఎలా తయారు చేయాలి? కరివేపాకు నూనె ప్రాథమికంగా ఏదైనా నూనెతో తాజా కరివేపాకు ఆకులను కలిపి తయారు చేయవచ్చు. సంప్రదాయకంగా మీరు వర్జిన్ కొబ్బరి నూనె, తాజా కరివేపాకు ఆకులను కలపడం ద్వారా ఈ నూనెను తయారు చేయవచ్చు.

మీరు ఈ నూనెను ఫిల్టర్ చేయవచ్చు లేదా మిశ్రమ నూనెను ఉపయోగించవచ్చు. మీరు దానిని ఒక గ్లాస్ కంటైనర్‌లో ఉంచి ఎప్పుడైనా ఉపయోగించవచ్చు.