Red Banana Benefits: వేరే రంగులో ఉన్నాయని చిన్న చూపు చూడకండి.. ఇవి పురుషులకు వరం..
సాధారణ పసుపు అరటిపండ్లతో పోలిస్తే.. ఎర్ర అరటిపండ్లలో ఎక్కువ పోషకాలు దాగుంటాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో సాధారణంగా ఆకుపచ్చ, పసుపు అరటిపండ్లను తింటారు.. చాలా తక్కువ మంది మాత్రమే ఎరుపు అరటిపండును తింటారు.
Updated on: Sep 11, 2024 | 3:47 PM

అరటిపండ్లలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. సాధారణ పసుపు అరటిపండ్లతో పోలిస్తే.. ఎర్ర అరటిపండ్లలో ఎక్కువ పోషకాలు దాగుంటాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో సాధారణంగా ఆకుపచ్చ, పసుపు అరటిపండ్లను తింటారు.. చాలా తక్కువ మంది మాత్రమే ఎరుపు అరటిపండును తింటారు. అయితే ఇప్పుడు ఎర్రటి అరటిపండు కూడా మార్కెట్‌లో ఎక్కువగా దొరుకుతోంది. భారతదేశంలో కూడా ఎర్రటి అరటి సాగు ప్రారంభమైంది. ఎర్రటి అరటిపండు తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు అయితే.. ఎర్రటి అరటిపండు వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియని వారు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. ఎర్రటి అరటిపండు వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలియకపోతే.. ఇప్పుడు తెలుసుకోండి.. ఎర్ర అరటిపండు తినడం వలన కలిగే నాలుగు ప్రధాన ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.

పురుషుల్లో సంతానోత్పత్తిని పెంచుతుంది : ఎర్ర అరటిపండ్లలో బీటా కెరోటిన్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఎర్రటి అరటిపండు పురుషుల సంతానోత్పత్తి శక్తిని, లిబిడోను పెంచుతుందని చెబుతారు. ఎర్రటి అరటిపండులోని పదార్ధం పురుషులలో సంతానోత్పత్తిని పెంచుతుంది. దీన్ని తినడం వల్ల పురుషుల్లో శక్తిని పెంచే టెస్టోస్టిరాన్ హార్మోన్ కూడా తగ్గకుండా ఉంటుంది.

కళ్లకు మంచిది: ఎర్రటి అరటిపండ్లలో లుటిన్, బీటా కరోనాయిడ్స్ ఉంటాయి. ఈ పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ఎర్రటి అరటి పండు.. కంటి బలహీనతను నయం చేస్తుంది. ఎర్రటి అరటి వృద్ధాప్యం వల్ల వచ్చే కంటి సమస్యలను దూరం చేస్తుంది.

చర్మం - జుట్టు సమస్యలు దూరం: ఎర్రటి అరటిపండ్లు వృద్ధాప్య ప్రభావాలను నిరోధించే కెరోటినాయిడ్లను కలిగి ఉంటాయి. ఎర్రటి అరటి చర్మం, జుట్టు ఆరోగ్యం రెండింటినీ అందంగా చేస్తుంది. ముఖ్యంగా జుట్టు రాలడం వల్ల బట్టతల వచ్చిన వారు అరటిపండ్లను వాడాలి. ఎర్రటి అరటిపండు తినడం వల్ల చర్మం ముడతలు తగ్గుతాయి మరియు జుట్టు రాలడం సమస్యను నయం చేస్తుంది.

రక్తాన్ని శుద్ధి చేస్తుంది: ఎర్రటి అరటిపండుకు రక్తాన్ని శుద్ధి చేసే శక్తి కూడా ఉంది. ఎర్రటి అరటిపండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో హిమోగ్లోబిన్, ఐరన్ స్థాయిలను పెంచుతాయి. ఎర్ర అరటిపండ్లలో విటమిన్ B6 పుష్కలంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలో సహాయపడుతుంది. ఎర్రటి అరటిపండు తింటే రక్తహీనత వంటి వ్యాధులు త్వరగా నయమవుతాయి.

అరటిపండు తినే సమయం..: ఎర్రటి అరటిపండులో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలన్నీ శరీరానికి అందాలంటే సరైన సమయంలో తినడం చాలా అవసరం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎర్ర అరటిపండును ఉదయం ఖాళీ కడుపుతో తినాలి. మీరు ఉదయం ఖాళీ కడుపుతో తినలేకపోతే, సాయంత్రం 4 గంటలలోపు అరటిపండు తినండి. వాస్తవానికి అరటిపండ్లు ఎప్పుడైనా తినవచ్చు.. అయితే.. మీరు సాయంత్రం తర్వాత అరటిపండు తింటే, మీరు శరీరం బరువుగా, మందగించినట్లు అనిపిస్తుంది.




