Guava in Winter: చలికాలంలో జామ తింటే ఏమవుతుందో తెలుసా?
Guava for health in winter: పండ్లు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసిందే. ప్రతి పండు మన ఆరోగ్యానికి ఎంతో కొంత ఖచ్చితంగా మేలు చేస్తుంది. అందుకే చాలామంది తమ రోజును పండ్లతో ప్రారంభిస్తారు. దాదాపు అన్ని పండ్లు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనాలను అందిస్తాయి. ఇందులో ముఖ్యమైన పండ్లలో జామ ఒకటి..
Updated on: Nov 14, 2025 | 8:43 PM

పండ్లు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసిందే. ప్రతి పండు మన ఆరోగ్యానికి ఎంతో కొంత ఖచ్చితంగా మేలు చేస్తుంది. అందుకే చాలామంది తమ రోజును పండ్లతో ప్రారంభిస్తారు. దాదాపు అన్ని పండ్లు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనాలను అందిస్తాయి. ఇందులో ముఖ్యమైన పండ్లలో జామ ఒకటి.

ముఖ్యంగా శీతాకాలంలో జామపండ్లు మార్కెట్లో దండిగా కనిపిస్తాయి. జామపండ్లు ప్రతిరోజూ అందరికీ సులభంగా లభిస్తాయి. పైగా ధర కూడా తక్కువే. జామపండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా ప్రతిరోజూ ఒక జామపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

జామపండ్లలో ఫైబర్ దండిగా ఉంటుంది. పచ్చి జామపండు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మీకు ఏవైనా జీర్ణ సమస్యలు ఉంటే ప్రతిరోజూ ఒక జామపండు తినండి. ఇది జీర్ణ సమస్యలను సులువుగా పరిష్కరిస్తుంది.

జామలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపిక.

జామలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం నుంచి కూడా ఉపశమనం కలిగించి ప్రేగులను శుభ్రపరచడంలో సహాయపడుతుంది.




