- Telugu News Photo Gallery Cinema photos Actress Alia Bhatt shines in the dark with her glamour, beautiful photos
కారు చీకట్లో అందాల వెలుగులు.. ఆలియాను చూస్తే మతిపోవాల్సిందే!
అందాల ముద్దుగుమ్మ ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా చీకటిలో చందమామలా కనిపించి తన గ్లామర్‌తో ప్రతి ఒక్కరినీ కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.
Updated on: Nov 14, 2025 | 8:07 PM

బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతలా తన గ్లామర్, లుక్స్‌తో ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ చీకటిలో తన అందాలతో వెలుగులు విరజిమ్ముతూ.. తన ఫ్యాన్స్‌కు అందాలవిందునిచ్చింది.

ఆలియా భట్ స్టార్ కిడ్‌గా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టి, అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. వరసగా సినిమాలు చేస్తూ, తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

ఈ బ్యూటీ బాలీవుడ్‌లో చాలా సినిమాల్లో నటించి , మంచి ఫేమ్ సంపాదించుకుంది. తర్వాత రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ,కాంబినేషన్‌లో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ద్వారా తెలుగు వెండితెరకు పరిచయం అయ్యింది. ఈ మూవీలో ఈ అమ్మడు అచ్చం పల్లెటూరి అమ్మాయిలా రెడీ, తన నటన, అందంతో అందరిని కట్టిపడేసింది. అయినప్పటికీ ఈ బ్యూటీ తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు.

దీంతో ఈ చిన్నది బాలీవుడ్‌లోనే వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా చీకటిలో తన అందాలతో అభిమానులను ఆగం చేస్తుంది.

చీకటిలో వెలుగునిచ్చేలా తన డ్రెస్‌తో , గ్లామర్‌తో అందరినీ కట్టిపడేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.



