- Telugu News Photo Gallery Amazing Health Benefits of Cardamom, eating cardamom daily can cure cancer and more health issues
ఇవి జస్ట్ ఏలకులేగా అనుకునేరు..! డైలీ రెండు తింటే ఏమవుతుందో తెలుసా.. అమేజింగ్ అంతే..
సుగంధ ద్రవ్యాల్లో ఏలకులు కూడా ఒకటి.. ఏలకుల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. వీటిని వంటల్లో వేయడం ద్వారా.. వాటి రుచి సువాసన రెట్టింపవుతుంది.. దీంతోపాటు ఆరోగ్యానికి చాలా మంచిది.. అందుకే.. డైలీ డైట్ లో యాలకులను భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు.
Updated on: Oct 06, 2024 | 2:04 PM

సుగంధ ద్రవ్యాల్లో ఏలకులు కూడా ఒకటి.. ఏలకుల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. వీటిని వంటల్లో వేయడం ద్వారా.. వాటి రుచి సువాసన రెట్టింపవుతుంది.. దీంతోపాటు ఆరోగ్యానికి చాలా మంచిది.. అందుకే.. డైలీ డైట్ లో యాలకులను భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. ఏలకులలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, టెర్పెనెస్, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్‌లో పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో మంట, ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొంటాయి. ఈ సమ్మేళనాలు కణాలను దెబ్బతినకుండా రక్షించడానికి, వాపును తగ్గించడానికి, మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. యాలకులు రక్తపోటును తగ్గిస్తాయి.. ఇంకా శ్వాసను మెరుగుపరుస్తుంది.. బరువు తగ్గడానికి సహాయపడుతాయి. ఏలకులు తీసుకోవడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్, డయాబెటిస్ వంటి పరిస్థితులతో పోరాడటంతో పాటు నోటి, గుండె, కాలేయ ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. డైలీ రెండు ఏలకులు తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి..

ఏలకులు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. మాంసాహారం లేదా శాఖాహారంలో ఏలకులను చేర్చడం లేదా నమలి తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఏసిడిటీ, గ్యాస్, ఉబ్బరం తగ్గిస్తుంది.

అందువల్ల, వీటిని తీసుకుంటే మొత్తం ఆరోగ్యానికి దోహదపడతాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి రోజూ రెండు ఏలకులు తినాలని చెబుతున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చట.

ఏలకులు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. శాకాహారం లేదా మాంసాహారంలో ఏలకులను తీసుకుంటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఎసిడిటీ, గ్యాస్, ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.

వర్షాకాలం వచ్చిందంటే దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్యలకు ఏలకుల నీరు మంచిది. ఏలకులలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది అన్ని రకాల గొంతు సంబంధిత సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది.

వీటిని తీసుకోవడం వల్ల డిప్రెషన్, యాంగ్జయిటీ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఏలకులలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి. అలాగే, ఇది ముఖం నుంచి టాక్సిన్స్ తొలగించి, చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.




