మీ డైట్లో తాటి బెల్లం ఉంటే.. అనారోగ్యం నరకానికి చేరినట్టే..
ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు రోజురోజుకూ ఎక్కువై పోతున్నాయి. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల రోగాలు, వ్యాధులు ఎటాక్ చేస్తున్నాయి. చక్కెర పదార్థాలను కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తున్నాయి. చక్కెరకు బదులుగా తాటి బెల్లం తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తాటి బెల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మరి ఇది తినడం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Aug 09, 2025 | 4:48 PM

ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు రోజురోజుకూ ఎక్కువై పోతున్నాయి. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల రోగాలు, వ్యాధులు ఎటాక్ చేస్తున్నాయి. అంతేకాకుండా పోషకాలు ఉన్న ఆహారాలు కూడా తీసుకుంటూ ఉండాలి. కానీ పెద్దగా ఎవరూ వీటిని తినడం మానేశారు. రసాయనాలు ఎక్కువగా వేసి పంటలను పండించడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వాడే ప్రతీది కూడా ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపిస్తుంది. చక్కెరకు బదులుగా తాటి బెల్లం తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

పేగులను శుభ్ర పరుస్తుంది: తాటి బెల్లం తినడం వల్ల పేగులు అనేవి శుభ్రంగా క్లీన్ అవుతాయి. పేగుల్లో ఉండే మలిన పదార్థాలు, విష పదార్థాలు అనేవి బయటకు పోతాయి. శ్వాస కోశ, ఆహార గొట్టం, చిన్న పేగు, పెద్ద పేగులో ఉండే విషాలను బయటకు పంపిస్తుంది. పేగు క్యాన్సర్ అనేది రాకుండా అడ్డుకుంటుంది. అలాగే మలబద్ధక సమస్య కూడా ఉండదు.

మై గ్రెయిన్ తగ్గుతుంది: గోరు వెచ్చటి నీటిలో తాటి బెల్లం కలుపుకుని తాగడం వల్ల తల నొప్పి, మై గ్రెయిన్ తలనొప్పి, జలుబు, దగ్గు వంటివి కంట్రోల్ అవుతాయి. శ్వాస కోశ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

నెలసరి నొప్పులు తగ్గుతాయి: మహిళలు ప్రతి రోజూ కొద్దిగా తాటి బెల్లం తినడం వల్ల నెలసరి సమస్యలు అనేవి తగ్గుతాయి. పీరియడ్స్‌లో సమస్యలు వచ్చే వారు తాటి బెల్లం తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇది తినడం వల్ల బాడీలో ఎండార్ఫిన్‌లు రిలీజ్ అవుతాయి. ఇవి శరీరానికి విశ్రాంతిని స్థాయిని పెంచి.. తిమ్మిరి, కడుపు నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది.

ఎముకలు బలంగా ఉంటాయి: తాటి బెల్లంలో క్యాల్షియం, పొటాషియం, భాస్వరం ఎక్కువ మోతాదులో లభిస్తాయి. ఇవి ఎముకలను బలంగా, దృఢంగా ఉండేలా చేస్తాయి. ఎముకల బలహీనత నుంచి రక్షిస్తాయి. అంతే కాకుండా ఇనుము, మెగ్నీషియం అనేవి ఎక్కువగా లభిస్తాయి. ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచతాయి. రక్త హీనత లేకుండా చేస్తాయి. చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచతాయి.




