- Telugu News Photo Gallery According to World of Statistics this is the world population by year of 2100
World Population: భారీగా తగ్గనున్న చైనా జనాభా.. 2100 నాటికి భారత జనాభా ఎంతకు చేరనుందంటే..
వరల్డ్ ఆఫ్ స్టాటస్టిక్స్ ప్రపంచ జనాభౄకు సంబంధించి ఆసక్తికరమైన గణంకాలను విడుదల చేసింది. ఈ లెక్కల ప్రకారం 2100 నాటికి ప్రపంచంలో ఏయే దేశాల్లో ఎంత జనాభా ఉండనుందన్న వివరాలను వెల్లడించారు. ఈ సంస్థ అంచనా ప్రకారం వచ్చే 77 ఏళ్లలో భారత జనాభా ఎంతకు చేరనుందంటే..
Updated on: Jun 13, 2023 | 1:20 PM

భారత్‌లో జనాభా సంఖ్య రోజురోజుకీ భారీగా పెరుగుతోంది. ఇప్పటికే చైనాను దాటేసి అగ్ర స్థానంలోకి చేరుకుంది భారత్. ఓవైపు జనాభాలో ఇండియా దూసుకుపోతుంటే, మరోవైపు చైనా మాత్రం తగ్గిపోతోంది. క్రమంగా చైనా జనాభా తగ్గుముఖం పడుతోంది.

ఈ నేపథ్యంలోనే వరల్డ్ ఆఫ్ స్టాటస్టిక్స్ 2100 నాటికి ప్రపంచ జనాభా ఎలా ఉండనుందన్న దానిపై కొన్ని గణంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం భారత్ ప్రపంచలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా కొనసాగుతుండగా. చైనా రెండో స్థానంలో నిలవనుంది.

అయితే ఈ రెండు దేశాల మధ్య వ్యత్యాసం భారీగా ఉండనుంది. 2100 నాటికి భారత జనాభా 1,533 మిలియన్లకు చేరుతుండగా, చైనా జనాభా మాత్రం 771 మిలియన్ల వద్ద ఉండనున్నట్లు తెలిపారు.

ఇక ప్రపంచంలో అత్యధిక జనాభా ఉండే మూడో దేశంగా 546 మిలియన్లతో నైజీరియా నిలవనుంది. తర్వాతి స్థానంలో 487 మిలియన్ల జనాభాతో పాకిస్థాన్ ఉండనుంది.

431 మిలియన్ల జనాభాతో రిపబ్లిక్ ఆఫ్ కాంగో అత్యధిక జనాభా ఉండనున్న 4వ స్థానంలో ఉండనుంది. ఇక అగ్ర రాజ్యం అమెరికా సైతం జనాభాలో దూసుకుపోనుంది. 394 మిలియన్ల మందితో 5వ స్థానంలో ఉండనుంది. ఇక 2100 నాటికి ప్రపంచ జనాభా 10.35 బిలియన్లకు చేరుకోనుంది.





























