- Telugu News Photo Gallery A recent study has shown that micro and nanoplastics are entering our bodies from common food packaging used every day
Food: ఫుడ్‌ను ఇలా తింటున్నారా.. మీ బాడీ షెడ్డుకే..
మనం దాదాపు ప్రతిరోజూ ఉపయోగించే సాధారణ ఆహార ప్యాకేజింగ్ నుంచి సూక్ష్మ, నానోప్లాస్టిక్‌లు మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయని ఇటీవలి అధ్యయనంలో తేలింది. ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులు, ప్లాస్టిక్ మూతలు ఉన్న గాజు సీసాలు, ప్లాస్టిక్ టీ బ్యాగులు మన ఆహారం, పానీయాలలోకి మైక్రోప్లాస్టిక్‌లను విడుదల చేస్తున్నాయి. మైక్రోవేవ్ చేయగల ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారాన్ని వేడి చేయడం కూడా మైక్రోప్లాస్టిక్ కాలుష్యానికి దారితీస్తుంది. పదేపదే ఉపయోగించడం, వేడికి గురికావడం మైక్రోప్లాస్టిక్ షెడ్డింగ్ పెరుగుదల వెనుక ఉన్న కొన్ని ప్రధాన కారకాలు.
Updated on: Jul 04, 2025 | 11:05 AM

ప్లాస్టిక్‌లలో ప్యాక్ చేయబడిన ఆహార పదార్థాలు సూక్ష్మ, నానోప్లాస్టిక్‌లతో ఎలా కలుషితమవుతుందో స్విట్జర్లాండ్‌లోని లాభాపేక్షలేని ఫుడ్ ప్యాకేజింగ్ ఫోరమ్‌కు చెందిన జీవశాస్త్రవేత్త లిసా జిమ్మెర్‌మాన్ వెల్లడించారు. ఆహార ప్యాకేజింగ్ వాస్తవానికి ఆహారంలో కలిసే సూక్ష్మ, నానోప్లాస్టిక్‌లకు ప్రత్యక్ష మూలం అనే తెలిపారు.

ప్లాస్టిక్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి మైక్రోప్లాస్టిక్‌ల సంఖ్య పెరుగుతుందని పరిశోధనలో వెల్లడైంది. ఇది ఎక్కువగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ద్వారా జరుగుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ప్లాస్టిక్ కూల్ డ్రింక్స్, నీళ్లు ప్యాక్ చేయబడిన బాటిల్స్ కోసం ఎక్కువగా వాడుతున్నారు. అందుకే ఈ బాటిల్స్ వాడిన వెంటనే నలిపి పారవేయండి.

అధ్యయనం ప్రకారం, పరిశోధకులు బీరు, డబ్బా చేపలు, బియ్యం, మినరల్ వాటర్, టీ బ్యాగులు, టేబుల్ సాల్ట్‌లు, టేక్-అవుట్ ఫుడ్స్, శీతల పానీయాల వంటి ఆహార, పానీయాల ఉత్పత్తులలో సూక్ష్మ, నానోప్లాస్టిక్‌లను కనుగొన్నారు.

ఇటీవలి శాస్త్రీయ ఆధారాలు ఆహార సంబంధ వస్తువులు (FCAలు) మిల్లీమీటర్ నుండి నానోమీటర్ పరిధిలో చిన్న ప్లాస్టిక్ కణాలను విడుదల చేస్తాయని సూచిస్తున్నాయి, వీటిని మైక్రో, నానోప్లాస్టిక్స్ (MNPలు) అని పిలుస్తారు. వీటివల్ల భవిష్యత్తులో సమస్యలు వస్తాయని అంటున్నారు.

మైక్రోప్లాస్టిక్ వినియోగం వల్ల జీర్ణవ్యవస్థలో వాపు, జీవక్రియ మార్పులు, అవయవ నష్టం వంటి ఆరోగ్య ప్రమాదాలు సంభవిస్తాయి. మైక్రోప్లాస్టిక్‌కు గురికావడాన్ని తగ్గించడానికి, ఆహారాన్ని నిల్వ చేయడానికి, వేడి చేయడానికి గాజు లేదా సిరామిక్ కంటైనర్‌లను ఉపయోగించడం, తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం, పండ్లు. కూరగాయలను పూర్తిగా కడగడం వంటివి అలవరచుకోవాలి.




