AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi Issue: ‘పార్టీ’ అంటే కాంగ్రెస్ పార్టీ అనే అవగాహన అవసరం.. రాహుల్ గాంధీ ఇష్యూపై విశ్లేషకుల అభిప్రాయం..

Rahul Gandhi Issue: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ నేపాల్ పర్యటన దేశ రాజకీయాలను ఊపేస్తోంది.

Rahul Gandhi Issue: ‘పార్టీ’ అంటే కాంగ్రెస్ పార్టీ అనే అవగాహన అవసరం.. రాహుల్ గాంధీ ఇష్యూపై విశ్లేషకుల అభిప్రాయం..
Rahul Gandhi
Shiva Prajapati
|

Updated on: May 05, 2022 | 4:14 AM

Share

Rahul Gandhi Issue: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ నేపాల్ పర్యటన దేశ రాజకీయాలను ఊపేస్తోంది. తన స్నేహితురాలు, CNN మాజీ కరస్పాండెంట్ సుమ్నిమా ఉదాస్ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు నేపాల్‌లోని ఖాట్మండుకు వెళ్లిన ఆయన.. ఓ నైట్ క్లబ్‌లో పార్టీకి హాజరవడం కలకం రేపింది. రాహుల్ గాంధీ పార్టీకి వెళ్లిన వీడియోను బీజేపీ ఐటీ సెల్ ఇన్‌చార్జ్ అమిత్ మాల్వియా ట్వీట్ చేయడంతో.. అది వైరల్ అయ్యింది. అయితే, తమ నాయకుడి చర్యను కవర్ చేయడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేశారు. ఇందులో తప్పేం ఉందంటూ ఎదురు దాడికి పాల్పడ్డారు.

కాగా, రాహుల్ గాంధీ పార్టీకి హాజరవడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ నైట్ క్లబ్‌కు వెళ్లడాన్ని కొందరు తీవ్రంగా తప్పుపడుతుంటే.. మరికొందరు మాత్రం రాజకీయాలకు వ్యక్తిగత జీవితాన్ని ముడిపెట్టడం సరికాదంటూ ఆయనకు మద్దతు తెలుపుతున్నారు.

స్థానిక నివేదికల ప్రకారం.. మయన్మార్‌లో నేపాలీ రాయబారిగా పనిచేసిన భూమ్ ఉదాస్ కుమార్తె సుమ్నిమా ఉదాస్, నిమా మార్టిన్ షెర్పాను వివాహం చేసుకోనున్నారు. మే 5వ తేదీన నేపాల్‌లోని బౌద్ధాలో రిసెప్షన్ జరగనుంది. రాహుల్ గాంధీ, ఆయన స్నేహితులు ఖాట్మండు మారియట్ హోటల్‌లో బస చేసినట్లు స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి. ఇదిలాఉంటే ఈ వ్యవహారంపై ఆశిష్ మెహతా, అజయ్ ఝా విశ్లేషణ చేశారు. వారి అభిప్రాయం ఇలా ఉంది.

ఇవి కూడా చదవండి

విశ్లేషణ.. రాహుల్ గాంధీ జీవన శైలి తన రాజకీయ జీవితాన్ని చిన్నచూపుచూస్తోంది. ఆయన రాజకీయాల గురించి చర్చించదగిన అంశాలు ఏవీ లేవు. అయితే, చాలా మంది రాజకీయ నేతలకు వివాదాలు వారి నీడలా ఉంటాయి. వారిని ఎల్లప్పుడూ వివాదాలు అనుసరిస్తాయి. అయితే, రాహుల్ గాంధీ విషయంలో ఆయన ఒక ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి. ఆయన వ్యక్తిగత జీవితం.. మరింత ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. మిగతా ప్రముఖ నాయకులతో పోలిస్తే రాహుల్ గాంధీ యువకుడు. అటు రాజకీయాలు, ఇటు వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేస్తూ వచ్చిన వ్యక్తి. కొత్త తరం నాయకుడైన రాహుల్ గాంధీ.. ఇటు రాజకీయాలు, అటు వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేస్తూ ముందుకు సాగడంతో పాటు ఆదర్శంగా ఉండాల్సి ఉంటుంది.

అయితే, రాహుల్ తీసుకునే కొన్ని నిర్ణయాలు, పర్యటనలు ఆయనను మరింత ఇబ్బందులకు గురి చేస్తుంది. ప్రధానమంత్రి పదవికి పోటీదారుడైన రాహుల్ గాంధీ.. ఇలాంటి విషయాల్లో చిక్కుకోవడం ఇబ్బందిపెట్టే పరిణామాలనే చెప్పుకోవాలి. రాహుల్ గాంధీ విహారయాత్రలు.. రాజకీయంగా ‘పలాయనాలు’గా ప్రత్యర్థి రాజకీయ పార్టీల నేతలు ప్రచారం చేస్తారు.

వాస్తవానికి ఖాట్మండులో స్నేహితురాలి వివాహానికి రాహుల్ గాంధీ హాజరయ్యాడు. ఇతర నాయకుడు అయితే ఇది పెద్ద సమస్య కాదు.. కానీ, రాహుల్ గాంధీ విషయంలో మాత్రం ఇది కాస్త భిన్నం. ఆయన జాతీయ స్థాయి నాయకుడు కావడం, ప్రధాని అభ్యర్థి కావడంతో ప్రత్యర్థి పార్టీల నాయకులు రెచ్చిపోవడానికి ఆస్కారం లభించింది. ‘చైనీస్ రాయబారి’తో పార్టీలు చేసుకున్నానే ఆరోపణలు హస్యాస్పదం అయినప్పటికీ.. ఆయన సలహదారులు, ఆయన ఇమేజ్‌ మేక్ఓవర్ ఇచ్చే పని చేస్తే బాగుండేది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రధాన నాయకుడు పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా కనిపించాల్సిన సమయం ఆసన్నమైంది.

చర్చ.. కాంగ్రెస్ నాయకుడనే కారణంతో కొందరు వాస్తవాలను పరిశీలించకుండా తీవ్రమైన ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా, ప్రమాదకరంగా ఉందని ఆశిష్ మెహతా వాదించారు. కొన్నేళ్లుగా ఓ రహస్య సర్వే జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న వ్యక్తుల IQపై డేటాను సేకరించడం దీని లక్ష్యం. అయినప్పటికీ ఈ దీర్ఘకాలిక సర్వేలో భాగస్వాములు అని తెలియదు. సోషల్ మీడియా, మెసెంజర్ యాప్‌లలో నమ్మశక్యం కాని నాన్-ఫాక్టాయిడ్‌లను తేలడం, దానిని ఎంతమంది విశ్వసిస్తారో చూడటం దీని ఆలోచన. ఫ్యాక్ట్ చెకర్ వెబ్‌సైట్‌లలో సమాచారం వెల్లడిస్తున్నా గానీ.. చాలామంది గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఆసక్తికరంగా.. డేటా సెట్‌లు పార్టీల వారీగా క్రోడీకరించడం జరుగుతుంది. బీజేపీ మద్దతుదారుల కోసం సగటు ఐక్యూ సంఖ్య, ఏపీపీ మద్ధతుదారుల కోసం మరొకటి, ఇలా కొన్ని కొన్ని అంశాలపై పరిశోధనలు జరుపుతున్నారు.

ఏది ఏమైనప్పటికీ.. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నైట్ పార్టీలో కనిపించడం.. బీజేపీ ఎగతాళి చేయడం జరిగిపోయింది. అయితే, రాహుల్ గాంధీ చర్యను సమర్థించుకునేందుకు కాంగ్రెస్ ఆపసోపాలు పడుతుంది. అయితే, రాహుల్ పర్యటనలో తప్పేం లేదు. రాజకీయ నేతలందరూ ప్రైవేటు కార్యక్రమాలకు హాజరవుతారు. విషయం ఇంతటితో ఆగితే బాగుండేది. కానీ, రాహుల్ గాంధీ పక్కన నిల్చున్న మహిళ నేపాల్‌లోని చైనా రాయబారి హౌ యాంకీ అని వెంటనే ఒక ప్రచారం జరుగడం ప్రారంభమైంది. అది చాలా తీవ్రంగా అనిపించింది. ఓ వైపు మన దేశానికి, చైనాకు మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటుండగా.. ఆ దేశ దౌత్యవేత్తతో మనదేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కలిసి ఉండటం చర్చనీయాంశమైంది.

ఈ ఘటనపై కొందరు సీరియస్ అయ్యారు. భారత ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏదో కుట్ర జరుగుతోందని, చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెహ్రూ ‘బ్రిటీష్ ఏజెంట్’ అయితే, రాజీవ్ ‘కేజీఎఫ్’ ఏజెంట్, రాహుల్ ‘చైనా ఏజెంట్’లా ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. రాహుల్ గాంధీ పక్కన ఉన్నది చైనా రాయబారి కాదని తేలింది. ఆమె ఎవరనేది ఎవరూ గుర్తించలేదు కానీ, చైనా రాయబారి మాత్రం కాదని తేలింది. పెళ్లి వేడుకకు హాజరైన మహిళగా గుర్తించారు.

ఏది ఏమైనప్పటికీ.. రాహుల్ గాంధీ ఓ జాతీయ పార్టీలో ప్రధాన నాయకుడు మాత్రమే కాకుండా.. ప్రధాని అభ్యర్థి అనే విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడూ విహార యాత్రలకు వెళుతూ పార్టీలు చేసుకోవడం కాదు.. పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అనే భావన ఆయనలో ఉండాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఈ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.