Andhra Pradesh: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు ఇక అక్కడే..!
Andhra Pradesh: ట్రాఫిక్ చలాన్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులు ఇక నుంచి..
Andhra Pradesh: ట్రాఫిక్ చలాన్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులు ఇక నుంచి గ్రామ/వార్డు సచివాలయాల్లోనే చెల్లించువచ్చునని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ డిపార్ట్‌మెంట్, రాష్ట్ర గ్రామ/వార్డు సచివాలయాల శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. చలాన్లు ఎలా చెల్లించాలనే దానిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ట్వీట్ కూడా చేశారు. ‘‘ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులు ఇకపై సచివాలయాల్లోనే.. పెండింగ్ చలాన్లు, జరిమానాల చెల్లింపు సేవలు గ్రామ/వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంది. చలాన నెంబర్/ఆర్‌సీ లతో సచివాలయాల్లో సంప్రదించి ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేయొచ్చు.’’ అని గ్రామ/వార్డు సచివాలయ శాఖ ప్రకటించింది.
అయితే, ట్రాఫిక్ పోలీసులు విధించిన ట్రాఫిక్ చలాన్లను ఇప్పటి వరకు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాల్సి ఉండేది. అయితే, గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ ట్రాఫిక్ చలాన్లను చెల్లించే విధానం తెలియక ఇబ్బందులు పడుతున్నారు. దాంతో ట్రాఫిక్ చలాన్లు కూడా కుప్పగా పేరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. గ్రామ/వార్డు సచివాయంలో ట్రాఫిక్ చలాన్ క్లియర్ చేసేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ సేవను ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సులువుగా వినియోగించుకోవచ్చునని అధికారులు చెబుతున్నారు.
Traffic Challan services available in Village/Ward secretariats. #APGSWS #Echallan #Trafficchallans #challanpayments #GSWS #APGramaWardSachivalayam #గ్రామవార్డుసచివాలయం #మనజగనన్నప్రభుత్వం
Follow us on Facebook : https://t.co/FZdCBWi0TT Instagram : https://t.co/hxofPk6aNG pic.twitter.com/uq2jBrmlEW
— Grama Ward Sachivalayam, AP (@GSWSOfficial) May 4, 2022