Refugees: శరణార్థులను ఎగుమతి చేస్తున్న మూడో దేశంగా ఉక్రెయిన్‌.. శరణార్థులకు అతిథ్యమిస్తున్న దేశాలు ఇవే..

|

Mar 29, 2022 | 3:34 PM

Refugees: యుద్ధం, హింస, ప్రకృతి విపత్తులు కారణాలు ఏవైనా ఒక దేశానికి చెందిన ప్రజలు మరో దేశానికి వలస వెళ్లడం ప్రపంచ వ్యాప్తంగా జరిగే సర్వ సాధారణమైన విషయం. ఆయా దేశాల్లో ప్రభుత్వాలు ప్రజలకు భరోసా కల్పించడంలో విఫలమైనా, ఇతర దేశాల దాడులు పెరిగినా...

Refugees: శరణార్థులను ఎగుమతి చేస్తున్న మూడో దేశంగా ఉక్రెయిన్‌.. శరణార్థులకు అతిథ్యమిస్తున్న దేశాలు ఇవే..
Un Refugees Data
Follow us on

Refugees: యుద్ధం, హింస, ప్రకృతి విపత్తులు కారణాలు ఏవైనా ఒక దేశానికి చెందిన ప్రజలు మరో దేశానికి వలస వెళ్లడం ప్రపంచ వ్యాప్తంగా జరిగే సర్వ సాధారణమైన విషయం. ఆయా దేశాల్లో ప్రభుత్వాలు ప్రజలకు భరోసా కల్పించడంలో విఫలమైనా, ఇతర దేశాల దాడులు పెరిగినా బతుకు జీవుడా అంటూ, పొట్ట చేత్తో పట్టుకొని ఇతర దేశాలకు శరణార్థులుగా వెళుతుంటారు. తాజాగా ఉక్రెయిన్‌ మీద రష్యా దాడులు చేస్తున్న క్రమంలో ఉక్రెయిన్‌ ప్రజల జీవితాలు చితికిపోతున్నాయి.

ఇప్పటి వరకు లక్షల సంఖ్యలో జనం ఉక్రెయిన్‌ను విడిచి వెళ్లినట్లు ఐక్యరాజ్య సమితి చెబుతోంది. దీంతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా శరణార్థుల అంశం తెరపైకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఏయే దేశాల నుంచి ఏ దేశాలకు శరణార్థులుగా వెళుతున్నారు.? ఏ దేశం ఎక్కువ మంది శరణార్థులను ఎగుమతి చేస్తుంది. ఏ దేశం ఎక్కువ మంది శరణార్థులకు అతిథ్యమిస్తుందన్న వివరాలను ఐక్యరాజ్య సమితి శరణార్థుల ఏజెన్సీ ప్రకటించింది. ఈ వివరాల ప్రకారం..

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య నెలకొన్ని యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఎక్కువ మంది శరణార్థులకు అతిథ్యమిస్తున్న దేశంగా పోలాండ్‌ రెండో స్థానంలో నిలిచింది. ఉక్రెయిన్‌కు చెందిన ప్రజలు ఎక్కువగా పోలాండ్‌కు శరణార్థులుగా వెళ్లినట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఇప్పటి వరకు ఉక్రెయిన్‌కు చెందిన దాదాపు 30 లక్షల మంది యూరప్‌తో పాటు ప్రపంచంలోని ఇతర దేశాలకు వలస వెళ్లినట్లు తేలింది. అత్యధికంగా పోలాండ్‌కు శరణార్థులుగా వెళ్లారు. పోలాండ్‌ రాజధాని వార్సా శరణార్థులకు స్వర్గధామంగా మారింది. గడిచిన కొన్ని వారాలుగా ఈ నగరానికి భారీ ఎత్తున ఉక్రెయిన్‌ శరణార్థులుగా చేరకుంటున్నారు.

శరణార్థులకు ఆతిథ్యమిస్తున్న తొలి ఐదు దేశాలు..

ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం మొత్తం శరణార్థుల్లో 39 శాతం మందికి కేవలం ఐదు దేశాలే అతిథ్యాన్ని ఇస్తున్నాయి. వీటిలో 3.7 మిలియన్‌ శరణార్థులతో టర్కీ మొదటి స్థానంలో ఉండగా. 1.7 మిలియన్స్‌ మందితో కొలంబియా రెండో స్థానంలో, 1.5 మిలియన్‌ మందితో ఉగండా మూడో స్థానం, 1.4 మిలియన్లతో పాకిస్థాన్‌ నాల్గవ స్థానంలో, జర్మనీ 1.2 మిలియన్స్‌తో ఐదవ స్థానంలో ఉంది.

శరణార్థులు ఎక్కువగా ఎక్కడ నుంచి వస్తున్నారు.?

ఐక్యరాజ్య సమితి వెల్లడించిన లెక్క ప్రకారం శరణార్థులుగా తమ దేశాన్ని విడిచి వెళుతోన్న వారిలో కేవలం 5 దేశాల్లోనే 68 శాతం మంది ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం 6.8 మిలియన్‌ మందితో సిరియన్‌ అరబ్‌ రిపబ్లిక్‌ శరణార్థులను ఎక్కువగా ఎగుమతి చేస్తున్న దేశాల్లో మొదటి స్థానంలో ఉంది. తర్వాత 4.1 మిలియన్స్‌తో వెనుజులా రెండో స్థానం, 2.6 మిలియన్స్‌తో ఆఫ్గనిస్తాన్‌ మూడో స్థానం, 2.2 మిలియన్స్‌తో సౌత్‌ సుడాన్‌ నాల్గవ స్థానం, 1.1 మిలియన్స్‌తో మయన్మార్ ఐదవ స్థానంలో ఉంది.

శరణార్థులుగా మారుతోన్న వారిలో అధికులు వీరే..

* 2020 లెక్కల ప్రకారం శరణార్థులుగా మారుతోన్న వారిలో దాదాపు 42 శాతం అంటే 35 మిలియన్ల మంది 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారే అని తేలింది.  ఇక శరణార్థులుగా వలస వెళుతున్న పెద్దల్లో 47.3 శాతం మంది మహిళలు ఉండగా, 48.3 శాతం పురుషులు ఉన్నట్లు తేలింది.

Also Read: Food Knowledge: ఎక్స్‏పైరీ డేట్ లేని ఆహార పదార్థాలు ఎంటో తెలుసా.. తేనే నుంచి బియ్యం వరకు..

Shocking News: అదో మిస్టరీ.. తిరుగుతూ.. తిరుగుతూ రైలు కింద పడ్డ కానిస్టేబుల్.. అసలు ఏం జరిగిదంటే..

IPL 2022: బీసీసీఐ సంచలన నిర్ణయం.. అమలులోకి న్యూ రూల్స్.! ఆ విదేశీ క్రికెటర్లకు దిమ్మతిరిగే షాక్..