Viral Video: మాస్క్‌ని ఇలా కూడా ఉపయోగిస్తారా? వీళ్ల తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!
Viral Video: కొంతమంది ప్రజలు చాలా భిన్నంగా ఆలోచిస్తుంటారు. వారి ఆలోచనలు ఆచరణలోకి వస్తే కొన్ని అద్భుతాలు ఆవిష్కృతం..
Viral Video: కొంతమంది ప్రజలు చాలా భిన్నంగా ఆలోచిస్తుంటారు. వారి ఆలోచనలు ఆచరణలోకి వస్తే కొన్ని అద్భుతాలు ఆవిష్కృతం అవుతుంటాయి. మరికొన్ని నవ్వు తెప్పిస్తుంటాయి. అయితే, కొందరిలోని అతితెలివి వారిలోని విచిత్ర వైఖరిని బయటపెడతాయి. వారు చేసే పనులు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. ఇలాంటి అతితెలివి గలవారికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. ఈ వీడియోను చూస్తే కచ్చితంగా కడుపుబ్బా నవ్వుకుంటారు. వీళ్ల తెలివి తగలెయ్య అని నెత్తి పట్టుకుని.. ఇదేం వాడకం రా బాబూ అని మనసులో అనుకుంటారు. అవును మరి ఆ రేంజ్‌లో ఉంటుంది ఆ వీడియో.
ప్రస్తుతం కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కరోనా వైరస్ నుంచి తప్పించుకునేందుకు ప్రతీ ఒక్కరు నిత్యం మాస్క్ ధరించి, శానిటైజర్ పెట్టుకుంటూ తోచిన జాగ్రత్తలు పాటిస్తూ వస్తున్నారు జనాలు. కొందరు వ్యక్తులు మాస్కులను ఒక్క రోజు మాత్రమే వినియోగిస్తుంటారు. పాత వాటిని పాడేస్తుంటారు. మరికొందరు రోజు వారీగా వాష్ చేసి వినియోగిస్తుంటారు. అయితే, వీరు మాత్రం ఈ మాస్కులను రకరకాలుగా ఉపయోగిస్తున్నారు. వారి వాడకం చూస్తే.. ద్యేవుడా.. అంటారు. ఒకసారి వినియోగించిన మాస్క్‌ను పడేయం ఇష్టం లేక.. వాటికి నెక్ట్స్ లెవల్‌లో వాడేస్తున్నారు.
ఈ వీడియోలో కొందరు వ్యక్తులు తమ మాస్కులను నీటిని వడపోయటానికి ఉపయోగిస్తే.. మరికొందరు తమ పిల్లలకు డైపర్లుగా వినియోగించడం చూడొచ్చు. జడ కొప్పుగా, పూల కుండీగా, చాయ్ వడపోసే జాలి గా, కాలికి సాక్స్‌లా, పక్షులకు ఊయలలా, ఎండ తగలకుండా టోపీలా.. ఇలా ఒకటేమిటి.. రకరకాలుగా వినియోగిస్తూ తమలోని టాలెంట్‌ను బయటపెట్టేస్తున్నారు. ఈ వీడియోను ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ శర్మ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఇప్పుడది తెగ ట్రోల్ అవుతోంది. వాడకం అంటే మన దేశ ప్రజలను చూసే నేర్చుకోవాలంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ప్రజల్లో సృజనాత్మకతను కొనియడుతున్నారు. మొత్తానికి ఈ ఫన్నీ వీడియో నెట్టింట్లో తెగ రచ్చ చేస్తోంది. మరెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరూ చూసేయండి.
Viral Video:
Indian #Gems – छोड़ते नही अंत तक…
It happens only in #India???
ऐसा सिर्फ #भारत मे हो सकता है ☺️☺️? pic.twitter.com/tU1L7h9gDl
— Rupin Sharma IPS (@rupin1992) July 2, 2021
Also read:
Aasara Pensions: తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ఇకపై 57 ఏళ్లు నిండిన వారందరికీ ఆసరా పింఛన్..!
Road Accident: అతి వేగం.. నిర్లక్ష్యం.. ఆరుగురి ప్రాణాలు బలి.. ట్రాక్టర్ కిందికి దూసుకెళ్లిన కారు