Shocking Video: తేలు విషాన్ని చిమ్మడం ఎప్పుడైనా చూశారా?.. అయితే ఈ షాకింగ్ వీడియోలో చూడండి..
Shocking Video: భూమిపై కొన్ని కోట్ల జీవులు మనుగడ సాగిస్తున్నాయి. వాటిలో కొన్ని సాధారణమైనవి అయితే, మరికొన్ని విషపూరితమైనవి...
Shocking Video: భూమిపై కొన్ని కోట్ల జీవులు మనుగడ సాగిస్తున్నాయి. వాటిలో కొన్ని సాధారణమైనవి అయితే, మరికొన్ని విషపూరితమైనవి ఉన్నాయి. విషపూరితమైన జీవుల్లో ప్రముఖంగా వినిపించే పేర్లు పాములు, తేళ్లు. ఇవి గనుక మనిషిని గానీ, ఇతర ఏ జీవిని గానీ కరిచినా, కుట్టినా క్షణాల్లో వాటి విషయం ఒళ్లంతా పాకి ప్రాణాలు కోల్పోతారు. ఇక ముఖ్యంగా తేలు కుట్టినట్లయితే.. దాని విషం అత్యంత వేగంగా శరీరంలోకి వ్యాప్తి చెందుతుంది. చాలా మంది పాము విషాన్ని, పాము విషయం చిమ్మడాన్ని చూసే ఉంటారు. మరి తేలు విషాన్ని మీరెప్పుడైనా చూశారా? తేలు విషాన్ని చిమ్మడం మీరెప్పుడైనా చూశారా? ఒకవేళ మీరు చూడకపోతే ఇప్పుడు చూడండి. తేలు విషం చిమ్ముతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యూలేట్ అవుతుంది. ఈ వీడియోను ఎవరో సైంటిస్టులో, జియోగ్రాఫికల్ ఛానెల్‌లోనో వచ్చింది కాదండోయ్. ఓ సాధారణ వ్యక్తులు దీనిని వీడియో తీశారు.
ఈ వీడియోలో ఓ నల్ల తేలు ఉంది. ఆ తేలును వీడియో తీస్తూ పక్కనే మనిషి ఉన్నాడు. అయితే, సాధారణంగానే ఏదైనా అడ్డొస్తే తేలు కుట్టుతుంది. ఈ వీడియోలో కూడా తేలు కుట్టే ప్రయత్నం చేసింది. అయితే, అందుబాటులో ఎవరూ లేకపోవడంతో అది కుట్టేందుకు చేసి ప్రయత్నంలో విషాన్ని మాత్రం చిమ్మింది. ఈ వీడియోను స్లో మోషన్ లో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది చూస్తే కచ్చితంగా మీరు షాక్ అవుతారు. ఆ తేలు తన తోకను ముందుకు కదిలిస్తుంది. ఆ క్రమంలో విషయం బయటకు వస్తుంది. దాదాపు రెండు మూడు చుక్కల విషం ఉండొచ్చు. అదే విషం గనుక మనిషి శరీరంలోకి ప్రవేశిస్తే.. పరిస్థితి ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
తేలు విషం చిమ్ముతున్న వీడియోను ట్విట్టర్ యూజర్Chakravarty Sulibele(@astitvam) షేర్ చేశారు. ఈ వీడియోను రెండు రోజుల క్రితం పోస్ట్ చేయగా.. ఇప్పటి వరకు 10 వేల మందికి పైగా నెటిజన్లు వీక్షించారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు సైతం షాక్‌కు గురవుతున్నారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియోను మీరూ చూసేయండి.
Viral Video:
A wonderful video showing Scorpion spilling out poison. Video shot by a friend @ChandraNamo @ParveenKaswan @susantananda3 pic.twitter.com/a9bWgqYTZH
— Chakravarty Sulibele (@astitvam) July 1, 2021
Also read:
రెండేళ్లయింది.. రాజధాని అమరావతి భూముల్లో ఒక్క అక్రమాన్ని బయట పెట్టలేకపోయారు : పట్టాభి