పాపం ఒకటి అనుకున్నాడు.. మరోటి జరిగింది.. పక్షి ఇచ్చిన పనిష్‌మెంట్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Funny Video: జంతువులు, పక్షులకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంటాయి.

  • Shiva Prajapati
  • Publish Date - 10:26 pm, Wed, 7 April 21
పాపం ఒకటి అనుకున్నాడు.. మరోటి జరిగింది.. పక్షి ఇచ్చిన పనిష్‌మెంట్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Bird

Funny Video: జంతువులు, పక్షులకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలు కొన్ని సరదాగా ఉంటే.. మరికొన్ని బాధ కలిగించేవి ఉంటాయి. కొన్ని కొన్ని వీడియోలను చూస్తుంటే నవ్వు ఆపుకోలేం కూడా. అలాంటి వీడియోనే ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆహారం పెట్టబోయిన ఓ వ్యక్తికి పక్షి ఊహించని ఝలక్ ఇచ్చింది. ఆ వీడియోను చూస్తే మీరూ నవ్వు ఆపుకోలేరంటే నమ్మండి. ఇంతకీ ఆ వీడియోలో అంతలా ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా.. పక్షులు, జంతువుల వంటి మూగ జీవాలకు ఆహారం అందిస్తుంటాం. ప్రస్తుతం ఎండాకాలం నేపథ్యంలో చాలా మంది తమ తమ ఇళ్లల్లో పక్షులు తాగేందుకని నీటిని ఏర్పాటు చేస్తుంటారు. అందుకోసం ప్రత్యేకంగా కొన్ని పాత్రలను కూడా సిద్ధం చేస్తుంటారు. అలా చేయడం వలన ఆత్మసంతృప్తితో పాటు.. పుణ్యం వస్తుందని అందరూ భావిస్తుంటారు. అయితే, ఇలాంటి కార్యక్రమాలతోనే కొందరు కొంటె పనులు కూడా చేస్తుంటారు. మూగజీవాలకు ఆశ చూపి.. ఆడుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఈ విషయంలో కొందరు సఫలం అయితే, కొందరు అడ్డంగా బుక్కవుతుంటారు. తాజాగా ఈ వీడియోలోని వ్యక్తి కూడా అలాగే చేయబోయి అడ్డంగా బుక్కయ్యాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. సముద్రం ఒడ్డున గల ఓ బ్రిడ్జిపై వ్యక్తి పక్షులకు ఆహారం వేసే ప్రయత్నం చేశాడు. అయితే, అందరిలా కాకుండా కొత్తగా ట్రై చెయ్యబోయి బోల్తా పడ్డాడు. ఆ వ్యక్తి చిన్న ఆహార పదార్థాన్ని తన నోటితో పట్టుకుని పక్షులను ఆహ్వానించాడు. అంతలోనే వచ్చిన ఓ పక్షి అతని మొహంపై రెట్ట వేసి తుర్రుమంది. అది సరిగ్గా అతను నోటి వద్దే పడింది. పక్షి ఇచ్చిన ఝలక్‌తో బిత్తరపోవడం అతని వంతైంది. అయితే ఈ ఘటననంతా మరో వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా తెగ వైరల్ అవుతోంది.

కడుపుబ్బా నవ్విస్తున్న ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. సదరు వ్యక్తికి తిక్క కుదిరిదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 50 లక్షల మందికిపైగా నెటిజన్లు తిలకించారు. మరి అంతలా ఆసక్తికరంగా ఉన్న వీడియోను మీరూ చూసేయండి.

Twitter Video:

Also read:

Viral News: ఒళ్లంతా గాయాలే.. బట్టలు లేకుండానే పెళ్లి చేసుకున్నాడు.. పెళ్లి కూతురు రియాక్షన్ ఇది..

ఏపీలో రేపే పరిషత్ తీర్పు, ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌, చకచకా ఏర్పాట్లు.. భద్రతా చర్యలు