AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బాప్ రే.. కుక్కలు ఇలా కూడా చేస్తాయా? ఈ వీడియో చూస్తే పక్కా షాక్ అవుతారు..!

Best Reversing Dog Ever: మనుషులకు.. శునకాలకు మధ్య ఉండే అనుబంధాన్ని ప్రత్యేకంగా చెప్పలేం. కుక్కలను మనుషులు తమ కుటుంబ సభ్యులుగా భావించేవారు..

Viral Video: బాప్ రే.. కుక్కలు ఇలా కూడా చేస్తాయా? ఈ వీడియో చూస్తే పక్కా షాక్ అవుతారు..!
Shiva Prajapati
|

Updated on: May 24, 2021 | 9:34 PM

Share

Viral Video: మనుషులకు.. శునకాలకు మధ్య ఉండే అనుబంధాన్ని ప్రత్యేకంగా చెప్పలేం. కుక్కలను మనుషులు తమ కుటుంబ సభ్యులుగా భావించేవారు ఎంతోమంది ఉంటారు. కుక్కలు కూడా అంతేస్థాయిలో తమ తమ యజమానుల పట్ల అపారమైన విశ్వాసాన్ని చూపిస్తుంటాయి. ఇక కొన్ని కుక్కలకు అయితే అమోఘమైన తెలివితేటలు ఉంటాయి. ఒక్కోసారి వాటి తెలివి తేటలు మనుషులను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తమ చుట్టూ ఉన్న పరిస్థితులకు తగ్గట్లుగా.. సమయానుకూలంగా స్పందిస్తుంటాయి. తమ తమ యజమానులకు అండగా ఉంటాయి. అలాంటి ఆసక్తికరమైన ఘటనే తాజాగా ఒకటి వెలుగు చూసింది. దానికి సంబందించిన వీడియో అంతర్జాలంలో తెగ హడావుడి చేస్తోంది. ఆ వీడియోలో కుక్క చేసిన పని చూసి నెటిజన్లు బాప్ రే అని ముక్కున వేలు వేసుకుంటున్నారు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ పెంపుడు కుక్క తన రెండు కాళ్లపై నడిబడి ఉండి.. మరో రెండు కాళ్లతో కారు పార్కింగ్ కోసం సిగ్నల్స్ ఇస్తోంది. పార్కింగ్ స్థలంలో కారు వెనుకవైపు నిల్చున్న ఆ కుక్క తన ఓనర్‌కు అవసరమైన సైగలు చేస్తోంది. కారు పార్కింగ్ లైన్ వద్దకు రాగానే.. ఆపమని చెబుతున్నట్లుగా అరుస్తూ కనిపించింది. దాంతో కారులోని వ్యక్తి కారును ఆపేస్తాడు.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఆ కుక్క తెలివికి ఫిదా అయిపోతున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను రెండు మిలియన్లకు పైగా వ్యూస్ రాగా.. 72,000 రీట్వీట్లు చేశారు. ఇక 2 లక్షలకుపైగా లైకులు కొట్టారు నెటిజన్లు. ‘అత్యుత్తమ డాగ్’ అని ఒక నెటిజన్ కామెంట్ చేస్తే.. టెస్లా కూడా ఈ పద్ధతిని అవలంభించాలని మరొక నెటిజన్ కామెంట్ చేశారు. భవిష్యత్‌లో కుక్కలు ప్రపంచాన్నే నడిపిస్తాయని సందేహం వ్యక్తం చేశారు.

Twitter Video:

Also read:

Minister Avanti Srinivas: రాజకీయ లబ్ధికోసమే లోకేష్ పరామర్శలు.. లోకేశ్‌పై మంత్రి అవంతి విమర్శలు

Indo Israel Agricultural Program: మరోసారి వ్యవసాయరంగంలో సహకారానికి ఇజ్రాయిల్ తో భారత్ ఒప్పందం..

Malaika Arora : చట్టపట్టాలేసుకు తిరగడం వరకు సరే.. ఇప్పటికైనా ఈ ప్రేమ జంట పెళ్లిపై స్పందిస్తారా..