ఇంట్లో ఎప్పుడూ సిరి సంపదలతో తులతూగాలంటే, సుభిక్షంగా ఉండాలంటే.. వాస్తుని పాటించాల్సిందే. వాస్తు దోషాలు ఉంటే అనేక సమస్యలకు దారి తీస్తుంది. ఏముందిలే అనుకుంటాం కానీ.. కొన్నింటి వల్ల కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇంట్లో డబ్బుకు లోటు ఉండకూడదంటే.. కొన్ని రకాల చిట్కాలను పాటించాల్సిందే. ఇంట్లోని వాస్తును తొలగించుకోవాలంటే.. వాస్తు శాస్త్రంలో వివిధ పద్దతులు చెప్పబడ్డాయి. వాటిల్లో ప్రత్యేకమైనవి.. గుర్రం, ఏనుగు, తాబేలు, జింక, కుక్క, సింహం విగ్రహాలు. ఇవి ప్రతి ఇంట్లోనే ఉపయోగిస్తూంటారు. ఏదో డెకరేషన్ కోసం ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా.. వీటితోనే కాస్త వాస్తు శాస్త్రాన్ని పాటిస్తే మాత్రం.. చక్కటి ఫలితాలు సాధించవచ్చు. వీటిని ఎక్కడ ఉంచితే సిరి సంపదలు సిద్ధిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏనుగు:
వాస్తు శాస్త్రంలో ఏనుగు చాలా పవిత్రమైనది. ముఖ్యంగా ఏనుగు లక్ష్మీ దేవి అమ్మవారికి ప్రతి రూపం. అలాంటి ఏనుగు విగ్రహాలను ఇంటి ఆగ్నేయ మూలల్లో ఉంచితే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల సంపద పెరగడమే కాకుండా.. పిల్లు చదువుల్లో రాణిస్తారు.
గుర్రం:
వాస్తు శాస్త్రంలో గుర్రాన్ని విజయం, శ్రేయస్సుకి చిహ్నంగా పరిగణించబడతారు. ఈ గుర్రపు విగ్రహాన్ని ఇంటికి దక్షిణ దిశలో ఉంచితే శుభ ప్రదంగా భావిస్తారు.
తాబేలు:
చాలా మంది ఇళ్లల్లో ఇప్పుడు తాబేలు విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. తాబేలును వాస్తు శాస్త్రంలో అదృష్టాన్ని ఆకర్షించడానికి తాబేలు ముఖ్యమైన జంతువుగా భావిస్తారు. దీన్ని ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచవచ్చు.
కుక్క:
కుక్కను ఇంట్లో పెంపుడు జంతువుగా పెంచుకోవడం చాలా మంచింది. ఒకవేళ మీకు అది ఇష్టం లేకపోతే.. ఇంట్లో ఏ దిక్కులో అయినా కుక్క బొమ్మలను ఉంచుకోవచ్చు. ఇలా కుక్క బొమ్మలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల శాంతి, ఆనందం నెలకొంటాయి.
సింహం:
చాలా మంది ఇళ్లలో సింహం బొమ్మలను చూస్తూనే ఉంటాం. వాస్తు శాస్త్రం ప్రకారం సింహం బొమ్మలను కానీ, విగ్రహాలను కానీ నైరుతి దిశలో ఉంచుకుంటే చాలా మంచిది. ఇది ఇంట్లో సంపదను పెంచుతుంది.
కోతి:
సాధారణంగా అందరి ఇళ్లలో కోతి బొమ్మలు ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం కోతి విగ్రహాలను వాయువ్య దిశలో ఉంచుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి.
జింక:
జింక విగ్రహాలను కూడా చాలా మంది ఇష్టపడి కొంటూంటారు. ఈ విగ్రహాలను ఇంట్లో ఉంచడం వల్ల శుభ ప్రదంగా ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం జింక విగ్రహాలను తూరు దిశలో ఉంచడం చాలా శ్రేయస్కరం. వీటిని ఈ దిక్కులో ఉంచడం వల్ల ఇంట్లో సమస్యలు తగ్గుతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.