Blood Moon: 26న ఆకాశంలో అద్భుతం.. కనువిందు చేయనున్న ‘సూపర్ బ్లడ్ మూన్’

Super Blood Moon: ఆకాశంలో ఈనెల 26న అద్భుతం ఆవిష్కృతం కానుంది. బుధవారం రోజున సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ సందర్భంగా చంద్రుడు సూపర్‌ బ్లడ్‌ మూన్‌గా

Blood Moon: 26న ఆకాశంలో అద్భుతం.. కనువిందు చేయనున్న ‘సూపర్ బ్లడ్ మూన్’
Super Blood Moon

Updated on: May 20, 2021 | 5:56 AM

Super Blood Moon: ఆకాశంలో ఈనెల 26న అద్భుతం ఆవిష్కృతం కానుంది. బుధవారం రోజున సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ సందర్భంగా చంద్రుడు సూపర్‌ బ్లడ్‌ మూన్‌గా కనిపించనున్నాడు. ఆరోజు సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే రేఖలోకి వస్తాయి. సూర్యుడు, చంద్రుని మధ్యలోకి భూమి వస్తుంది. ఈ క్రమంలో సూర్యకిరణాలు చంద్రునిపై పడవు. భూమి నీడ చంద్రునిపై పడుతుంది. ఈ సమయంలో కాంతి తరంగాల వల్ల చంద్రుడు ఎరుపు, నారింజ, గోధుమ రంగుల్లో కనిపించనున్నాడు.

బుధవారం చంద్రుడు.. భూమికి దగ్గరగా రానున్నాడు. సాధారణ రోజుల్లో కంటే పెద్దగా కనిపిస్తాడు. ఈనెల 26న సాయంత్రం ఈ అరుదైన సూపర్‌ బ్లడ్‌ మూన్‌ ఆవిష్కృతం కానుంది. సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా ఇది సంభవించనుంది. కాగా దేశంలో చంద్రగ్రహణం పాక్షికంగానే కనిపించనుంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో కొద్దిగా కనిపించనుంది. ఈ గ్రహణం సాయంత్రం 3.15 గంటలకు ప్రారంభమై 6.22 గంటలకు ముగుస్తుంది. అంటే 14 నిమిషాల 30 సెకన్ల పాటు గ్రహణం ఉంటుంది. అనంతరం సూపర్ బ్లడ్ మూన్ కనులవిందు చేయనుంది.

కోల్‌కతాలో ఇలాంటి చంద్ర గ్రహణాన్ని పదేళ్ల క్రితం ఆవిష్కృతమైననట్లు ఎంపీ బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్‌, ప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త దేబీ ప్రసాద్‌ దౌరీ తెలిపారు. ఈ చంద్ర గ్రహణం ఈశాన్య ఆసియా, పసిఫిక్‌ సముద్రం, ఉత్తర, దక్షిణ అమెరికా ప్రాంతాలు, ఆస్ట్రేయాలియాలో బాగా కనిపిస్తుందని తెలిపారు.

కాగా.. ఈ చంద్రగ్రహణం.. తరువాత- జూన 10వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. నవంబర్ 19వ తేదీన మరోసారి చంద్రగ్రహణం ఏర్పడుంది. అది పాక్షికమే. ఈ ఏడాది చివరిలో డిసెంబర్ 4వ తేదీన మరోసారి సూర్యగ్రహణం సంభవించనుంది.

Also Read:

Gold Coin Scheme: ఇండియన్ గోల్డ్ కాయిన్ స్కీమ్​లో కీలక మార్పులు.. ఇక బంగారం కొనుగోలు ఈజీ.. ఎలా అంటే..!

Village Business Ideas: గ్రామాల్లో ఈ వ్యాపారాలు చేస్తే మీరే లక్షాధికారులు.. తక్కువ ఖర్చు.. ఎక్కువ ఆదాయం..