Palm wine from Tamarind: బ్రహ్మంగారి చెప్పినట్టే.. చింత చెట్టుకు కల్లు..! చూసేందుకు ఎగబడుతున్న జనం..

గ్రామ పంచాయతీ సమీపంలో గల అంగడి బజారులోని ఎల్లబోయిన సోమ్మళ్ళు ఇంటి ఆవరణలో చింత చెట్టుకు కల్లు ఏరులై పడుతుంది. ఆశ్చర్యంతో తండోపతండాలుగా...

Palm wine from Tamarind: బ్రహ్మంగారి చెప్పినట్టే.. చింత చెట్టుకు కల్లు..! చూసేందుకు ఎగబడుతున్న జనం..
Palm Wine From Tamarind Tree

Edited By: Anil kumar poka

Updated on: Dec 28, 2022 | 7:12 PM

నందమాయా గురుడ నందామయా చింతచెట్టుకు కల్లు పారేనయా అంటూ కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పినది నిజమవుతున్నదా..! అంటే అవుననే అంటున్నారు జనగామ జిల్లా పాలకుర్తి వాసులు. గ్రామ పంచాయతీ సమీపంలో గల అంగడి బజారులోని ఎల్లబోయిన సోమ్మళ్ళు ఇంటి ఆవరణలో చింత చెట్టుకు కల్లు ఏరులై పడుతుంది. ఆశ్చర్యంతో తండోపతండాలుగా విచిత్రంగా చూస్తున్నా గ్రామస్తులు.సాధారణంగా తాటి, ఈత, ఖర్జూర చెట్లకు, ఆఖరికి కొబ్బరి, జీలుగ, వేప చెట్లకు కూడా కల్లు తీయడం చూస్తుంటాం. ఈ చెట్ల నుంచి వచ్చే కల్లును చాలా మంది ఇష్టంగా సేవిస్తుంటారు. వేప కల్లును ఆయుర్వేద ఔషధంగా కూడా వినియోగిస్తారు. వీటన్నింటికి భిన్నంగా చింత చెట్టుకు కల్లు రావడం ఎప్పుడైనా చూశారా? అంటే ఎవరైనా లేదనే అంటారు. పాలకుర్తిలో మాత్రం చింత చెట్టుకు కల్లు కారడం వింతగా మారింది.ఉన్నట్టుండి చింత చెట్టు నుండి కల్లు కారడం మొదలు పెట్టింది. అయితే చింత చెట్టు కూడా కలర్ రావడంతో జనం ఆశ్చర్యానికి గురవుతున్నారు. చింత చెట్టు నుండి కల్లు పారే దృశ్యాన్ని చూడడానికే స్థానికులు ఎగబడ్డారు. కాలజ్ఞానంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పినట్టే జరుగుతోందని చర్చించుకుంటున్నారు.