చాలా మంది వాస్తును ఎక్కువగా నమ్ముతూంటారు. నిజానికి ఇంట్లో వాస్తు ప్రకారం అన్నీ సరిగ్గా ఉంటేనే అన్నీ కరెక్ట్ ఉంటాయి. ఇంట్లో కొన్ని కొన్ని వస్తువుల స్థానాల విషయంలో సరిగ్గా చూసుకోవాలి. అవి అటూ ఇటూ ఉండడం వల్ల కూడా మనకు నష్టాన్ని తెచ్చి పెడుతూంటాయి. వాస్తు ప్రకారం అంతా బావుంటేనే ఇంట్లో ఆనందమైనా.. సుఖమైనా విల్లి విరుస్తుంది. లేని పక్షంతో పేదరికం తాండవం ఆడుతుంది. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఇంట్లో కొన్ని వస్తువుల ప్లేస్ ని మార్చాలి. వాస్తు దోషం వల్ల డబ్బు కొరత, నిరాశ, ఎంత ప్రయత్నించినా ఎలాంటి ఫలితం ఉండకపోవడం వంటికి జరుగుతాయి. కాబట్టి ఇంట్లో వాస్తు అనేది కాస్త సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది.
ఇప్పుడు సాధారణంగా అందరి ఇళ్లలోనూ టీపీ, ఫ్రిజ్, సోఫా, దివానా కట్, మిక్సీ, గ్రైండర్ వంటి సామాగ్రి ఉంటున్నాయి. ఈ వస్తువులను ఇంట్లో పెట్టుకోవడానికి చాలా మంది వాస్తును పట్టించుకోరు. వారి ప్లేస్ కి సరిపడగా ఎక్కడ అయితే బావుంటుందో అక్కడ సెట్ చేసుకుంటారు. కానీ ఈ వస్తువులు కూడా సరైన దిశలోనే ఉండాలి. లేదంటే వాస్తు దోషాల్ని కలిగిస్తాయి. మరి వాస్తు ప్రకారం టీవీ, ఫ్రిజ్ వంటి వస్తువులు ఎక్కడ ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టీవీ:
టీవీ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్ గా ఉండే వస్తువు. టీవీ లేని ఇల్లు మనకు కనిపించదు. ఇదో నిత్యవసర వస్తువు అని చెప్పాలి. టీవీతో కాలక్షేపం బాగా జరుగుతుంది. వాస్తు ప్రకారం టీవీని ఇంటి తూర్పు గోడపై పెట్టాలి. టీవీని తూర్పు దిశలో ఉంచి చూడటం వల్ల ఇంట్లో పాటిజివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. టీవీని ఈ దిశలో పెట్టడం వల్ల ఇంట్లోని వ్యక్తులు ఆనందంగా ఉంటారు. ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుంది.
ఫ్రిజ్:
ఫ్రిజ్ కూడా ఇప్పుడు అందరి ఇళ్లలోనూ కామన్ గా ఉంటుంది. దీన్ని కూడా నిత్యవసర వస్తువుగా భావించవచ్చు. ఫ్రిజ్ లేని ఇళ్లను అర కొరగా చూడవచ్చు. ఫ్రిజ్ ను వాస్తు ప్రకారం.. పశ్చిమ దిశ చాలా అనుకూలమైనది. ఈ దిక్కులో ఫ్రిఝ్ ఉండం వల్ల ఇంట్లోని వాస్తు దేవతలు సంతోషిస్తారు. ఇక చాలా మంది ఫ్రిజ్ ను ఈశాన్య దిక్కులో ఉంచుతారు. ఇలా అస్సలు పెట్టకూడదు. అలాగే తలుపు ముందు కూడా ఫ్రిజ్ ని పెట్టకూడదు. అలాగే మైక్రోవేవ్, స్టవ్ వంటి వాటిని ఫ్రిజ్ పక్కన పెట్టకూడదు.
సోఫా ఎక్కడ పెట్టాలంటే:
అలాగే కొంత మంది ఇళ్లలో సోఫా ఉండటం కూడా మనం చూస్తేనే ఉంటాం. వాస్తు ప్రకారం సోఫాను పశ్చిమ దిశలో ఉంచడం బెటర్. ఈ దిశలో సోఫాను ఉంచడం వల్ల శ్రేయస్సు, ఆనందాన్ని తెస్తుంది. అలాగే పేదరికం రాదు. లక్ష్మీ దేవి కూడా ఇంట్లోనే ఉంటుంది.
ఇంకా ఇంట్లోని యూజ్ చేసే సామాగ్రి విషయాల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే.. వాస్తు శాస్త్ర నిపుణులను సంప్రదించడం మేలు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.