Variety Fish: క్రేజీ ఫిష్.. కొండలు సైతం ఎక్కగలదు… మరో షాకింగ్ విషయం ఏంటంటే..?

|

Jul 21, 2021 | 7:22 PM

ప్రపంచం ఎన్నో వింత విషయాలతో నిండి ఉంది. వాటిలో కొన్నింటిని మాత్రమే మనం తెలుసుకున్నాం. ఇంకా చెప్పాలంటే.. మన చుట్టూ ఉన్న జీవుల గురించి కూడా అన్ని...

Variety Fish: క్రేజీ ఫిష్.. కొండలు సైతం ఎక్కగలదు... మరో షాకింగ్ విషయం ఏంటంటే..?
Credits: YAAP
Follow us on

ప్రపంచం ఎన్నో వింత విషయాలతో నిండి ఉంది. వాటిలో కొన్నింటిని మాత్రమే మనం తెలుసుకున్నాం. ఇంకా చెప్పాలంటే.. మన చుట్టూ ఉన్న జీవుల గురించి కూడా అన్ని విషయాలు అందరికీ తెలియదు. తాజాగా మీకు హవాయి దీవుల్లోని కనిపించే ఓప్ చేప గురించి వివరించనున్నాం. ఆశ్చర్యకరంగా ఈ చేప జలపాతాలలోని రాళ్లపై పాకుతూ సుమారు 300 మీటర్ల వరకు ప్రయాణించి ఎగువకు చేరగలుగుతుందట. ఈ ఓప్ చేపలకు నోరు, ఉదరం కింద ఉండే రెక్కల వంటి భాగాల ప్రత్యేక అమరిక ఉంటుంది. దాని సహాయంతో జలపాతాలలోని రాళ్లపై పాకుతూ ఎగువకు చేరుతాయి. ఇలా ఇవి సుమారు 300 మీటర్ల ఎత్తు వరకు కొండలు ఎక్కగలవని నిపుణులు చెబుతున్నారు. వీటికున్న మరో స్పెషాలిటీ ఏంటంటే.. మాములుగా ఇవి గోధుమ వర్ణంలో ఉంటాయి. అయితే పరిస్థితులకు తగ్గట్టు అవి ఉన్న పరిసరాలలో ఇమిడిపోతూ గుర్తుపట్టడానికి వీలు లేకుండా తమని తాము మార్చుకుంటాయి. ఈ చేపలు గరిష్ఠంగా ఒక అడుగు పొడవు వరకు పెరుగుతాయట.

ఆరు హవాయి దీవుల్లోనూ ఈ రకం చేపలున్నాయని, అయితే, వాటి సంఖ్య ఎంత ఉండొచ్చన్నది నిర్దిష్టంగా చెప్పలేమని అక్కడి పరిశోధకులు చెప్పారు. కాలువలు, సెలయేర్లు, నదులలో ఓప్ చేపలు పెట్టే గుడ్లు ప్రవాహంలోంచి సముద్రంలోకి వెళతాయి. అక్కడే ఈ చేపలు పుట్టి సముద్రం నుంచి మంచినీటి ప్రవాహంలోకి ఎదురీది చేరుతాయి. అక్కడి నుంచి మంచి నీటి చేపలుగానే పెరుగుతాయి. మొత్తం 5 జాతుల ఓప్ చేపలు ఉంటాయి. వీటిలో నాలుగు జాతులకు చెందిన ఓప్ చేపలకు రాళ్లపైకి పాకే ప్రత్యేకమైన సామర్థ్యం ఉందని పరిశోధకులు తెలిపారు.

Also Read సినీప్రియులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. ఈ నెల 30 నుంచి థియేటర్స్ ఓపెన్

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం .. వాస్తవ మృతుల సంఖ్య ఎంతంటే..? సర్వేలో షాకింగ్ విషయాలు