Bribe Case: యూనిఫాం తీసేసి ఎస్‌ఐ పరుగో పరుగు.. ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు.. అసలేమైందంటే..?

|

Nov 05, 2021 | 8:26 AM

Bizarre News: అతొనొక ఎస్‌ఐ.. అతణ్ణి పట్టుకునేందుకు రోడ్డుపై ఇద్దరు పోలీసులు.. అతని వెనుక పరుగులు తీస్తున్నారు. అసలు ఏం జరుగుతోందో.. ఎవరికీ అర్ధంకావడం లేదు. తీరా ఒక కీలోమీటరు

Bribe Case: యూనిఫాం తీసేసి ఎస్‌ఐ పరుగో పరుగు.. ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు.. అసలేమైందంటే..?
Bizarre News
Follow us on

Bizarre News: అతొనొక ఎస్‌ఐ.. అతణ్ణి పట్టుకునేందుకు రోడ్డుపై ఇద్దరు పోలీసులు.. అతని వెనుక పరుగులు తీస్తున్నారు. అసలు ఏం జరుగుతోందో.. ఎవరికీ అర్ధంకావడం లేదు. తీరా ఒక కీలోమీటరు పాటు ఛేజ్‌ చేసి.. ప్రజల సహాయంతో ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ సంఘటన కర్ణాటకలోని తమకూరు నగరంలో చోటుచేసుకుంది. అవినీతి ఆరోపణలు రావడంతో.. ఎస్‌ఐని పట్టుకునేందుకు అవినీతి నిరోధక శాఖ అధికారులు రోడ్లపై పరుగులు తీశారు. సగం యూనిఫాంలో పరుగులు తీస్తున్న ఆ ఎస్‌ఐని దాదాపు కిలోమీటరు దూరం వెంబడించి, ప్రజల సాయంతో పట్టుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమకూరు గుబ్బిన్ తాలుకాలోని చంద్రశేఖర్ పొరా పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న పోలీసులు.. ఓ కేసు విషయంలో చంద్రన్న అనే వ్యక్తి వాహనాన్ని సీజ్ చేశారు. అయితే.. దాన్ని విడిచిపెట్టేందుకు రూ.28 వేల లంచం ఇవ్వాలంటూ స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ సోమశేఖర్‌.. బాధితుడిని డిమాండ్‌ చేశారు. ఈ డబ్బులను తీసుకోవాలని కానిస్టేబుల్‌ నయాజ్‌ అహ్మద్‌ను పురమాయించాడు. దీంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించడంతో సీన్‌ రివర్స్‌ అయింది.

ఈ క్రమంలో అవినీతి నిరోధక శాఖ బ్యూరో ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మి, ఆమె బృందం ఎస్సైను పట్టుకునేందుకు ప్లాన్‌ రచించారు. బుధవారం చంద్రన్న దగ్గరి నుంచి రూ.12 వేలు తీసుకుంటున్న కానిస్టేబుల్‌ అహ్మద్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకోవాలని ఎస్‌ఐ చెప్పారని.. తనకేం సంబంధం లేదని కానిస్టేబుల్‌ వెల్లడించాడు. దీంతో ఏసీబీ అధికారులు కానిస్టేబుల్‌ను వెంటతీసుకుని స్టేషన్‌కు చేరుకున్నారు. ఇది గమనించిన ఎస్‌ఐ సోమశేఖర్‌.. వెంటనే తన యూనిఫాం షర్ట్‌ తీసేసి డస్ట్‌బిన్‌లో పడేసి.. స్టేషన్‌ నుంచి బయటకు పరుగులుతీశాడు. దీంతో ఏసీబీ అధికారులు ఆయన్ను వెంబడిస్తూ పరుగులు తీశారు. చివరకు స్థానికుల సాయంతో పట్టుకున్నారు. అనంతరం ఇద్దరిని అరెస్టు చేసి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మి తెలిపారు.

Also Read:

Viral Video: కోట్లు ఖర్చు చేసినా ఈ ఆనందం దొరుకుతుందా..? చిన్నారిని సర్‌ప్రైజ్‌ చేసిన తల్లి.. వీడియో వైరల్‌

Viral Video: వివాహా వేడుకలో.. తల్లితో కలిసి స్టెప్పులేసిన నవ వధువు.. వీడియో చూస్తే మైమరిచిపోవాల్సిందే..?