AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వివాహా వేడుకలో.. తల్లితో కలిసి స్టెప్పులేసిన నవ వధువు.. వీడియో చూస్తే మైమరిచిపోవాల్సిందే..?

Bride - Mother Dance Video: సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు ప్రతిరోజూ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం

Viral Video: వివాహా వేడుకలో.. తల్లితో కలిసి స్టెప్పులేసిన నవ వధువు.. వీడియో చూస్తే మైమరిచిపోవాల్సిందే..?
Viral Video
Shaik Madar Saheb
|

Updated on: Nov 04, 2021 | 2:31 PM

Share

Bride – Mother Dance Video: సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు ప్రతిరోజూ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. తాజాగా ఓ పెళ్లి వేడుకకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పెళ్లి వేడుకంటే ఎంత హడావుడిగా ఉంటుందో మనం చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి వేడుకలో వధువు, ఆమె తల్లి డ్యాన్స్‌ చేశారు. మంచి స్టెప్పులతో అందరినీ మైమరిపించారు. దీనికి సంబంధించిన వీడియోను చూసి.. నెటిజన్లు పలు విధాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఎమోషనల్‌ క్లిప్‌తో తమ హృదయాలను కదిలించారంటూ ఆనందం వ్యక్తంచేస్తున్నారు. కూతురు పెళ్లి సందర్భంగా తల్లి చేసిన ప్రదర్శన అందరినీ కదిలిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను YSDC వెడ్డింగ్ కొరియోగ్రఫీ ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేసింది. మల్లికా అగర్వాల్ వివాహా వేడుకలో ఆమెతోపాటు.. తల్లి కూడా అద్భుతంగా డ్యాన్స్‌ చేసింది.

వైరల్ అవుతున్న వీడియోలో.. వధువు, ఆమె తల్లి వేదికపై డ్యాన్స్ చేయడాన్ని చూడవచ్చు. ఇద్దరూ కలిసి అపురూపమైన స్టెప్పులు వేస్తారు. మాయేరీ పాటకు వారిద్దరూ వేసిన స్టెప్పులు నెటిజన్ల హృదయాలను కదిలిస్తుంది. వధువు పసుపు రంగు లెహంగాను మెరవగా.. తల్లి లేత గోధుమరంగు రంగు డ్రెస్‌లో కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఈ వీడియోను దాదాపు రెండు లక్షలమంది వీక్షించారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూడండి. వీడియో..

వైరల్‌ వీడియోపై నెటిజన్లు పలు విధంగా కామెంట్లు చేయడంతోపాటు షేర్‌ చేస్తున్నారు. ఈ వీడియో తమ హృదయాన్ని కదిలించిందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Viral: భారతదేశంలో ప్రత్యేక రైల్వే స్టేషన్.. సగం మహారాష్ట్రలో.. మరో సగం గుజరాత్‌లో.. ఎందుకో తెలుసా!

Jai Bhim Review: ప్ర‌శ్నించే గ‌ళం ఉంటే… ఫ‌లితం త‌ప్ప‌కుండా ఉంటుంద‌నే `జై భీమ్‌`