భారత రైల్వే ఆసియాలో రెండవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్. మన దేశంలో 8000 కి పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ అంశాలను బట్టి వివిధ ప్రాంతాలలో ఉన్న రైల్వే స్టేషన్లు ప్రత్యేక ప్రాచుర్యం పొందాయి. జనం నోళ్లలో నానాలి.. లేదా వార్తల్లో చర్చనీయాంశం అవ్వాలంటే దేనికైనా ఒక ప్రాముఖ్యత ఉండాలి. అలాంటి ఒక రైల్వే స్టేషన్ గురించి ఈ రోజు మనం మీకు చెప్పబోతున్నాం. దానికి సొంత గుర్తింపు లేదు. అవును మేము చెప్పబోయే రైల్వే స్టేషన్‌కు పేరు లేదు.
అవును, మేము చెప్పేది నిజమే. మన దేశంలో పేరు లేని స్టేషన్ ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని ఆద్రా రైల్వే డివిజన్‌లోని పేరులేని రైల్వే స్టేషన్ గురించి మేము మాట్లాడుతున్నాం. బంకురా-మసాగ్రామ్ రైలు మార్గంలో ఉన్న ఈ స్టేషన్ రైనా, రైనగర్ అనే రెండు గ్రామాల మధ్య వస్తుంది. ఈ స్టేషన్ ప్రారంభ రోజుల్లో రైనాగర్ అని పిలువబడింది. కానీ రైనా గ్రామ ప్రజలు దీనిని వ్యతిరేకించి తమ గ్రామం పేరిట ఈ స్టేషన్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కారణంగా రెండు గ్రామాల ప్రజల మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ విషయం రైల్వే బోర్డుకు చేరింది. వివాదాన్ని పరిష్కరించడానికి, రైల్వే స్టేషన్… బోర్డు నుండి స్టేషన్ పేరును తొలగించారు అధికారులు.
దీనివల్ల వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. పేరు లేకపోవడం వల్ల ప్రయాణీకులు దాని గురించి ఇతర వ్యక్తులను అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే, రైల్వే శాఖ ఇప్పటికీ దాని పాత పేరు రైనగర్ పేరుమీదనే ప్రయాణీకులకు టిక్కెట్లను జారీ చేస్తుంది.
Also Read: స్మోకింగ్ చేస్తూ.. హ్యాండ్స్ శానిటైజ్ చేసుకున్నాడు.. నడిరోడ్డుపై ఊహించని విధ్వంసం