‘రా’..తో అట్లుంటది మరి..! తేలుతున్న దేశద్రోహుల పాపాల లెక్కలు.. ఇక దబిడి దిబిడే..
భారత్‌లో గూఢచర్యం చేస్తే 10వేలు. ఇదీ పాకిస్తాన్ ఐఎస్‌ఐ ఇచ్చే ఆఫర్. అంత చీప్‌గా పడిపోతారా అనుకోవద్దు. సీఆర్‌పీఎఫ్ జవాను నెలకు 3500 ఇచ్చినందుకు.. సమాచారమంతా పాకిస్తాన్‌కిచ్చేశాడు. దారుణం ఏంటంటే.. భారతీయులై ఉండి దేశానికి ద్రోహం చేయడం. ఆపరేషన్ సింధూర్ తరువాత.. పాక్‌కు ఇన్ఫర్మేషన్ వెళ్తోందని పసిగట్టిన భారత నిఘా వ్యవస్థ.. ఒక్కొక్కరి ముసుగు తొలగిస్తూ దేశద్రోహులను పాతరేస్తోంది. ఈ ఆపరేషన్‌లో నెలలోనే 16 మంది దొరికిపోయారు. పంజాబ్‌లోని గగన్‌దీప్ సింగ్ కూడా అలాంటివాడే..

పాకిస్తాన్ ఐఎస్‌ఐ పిల్లచేపలతో పెద్ద ఆపరేషనే చేస్తోంది భారత్‌లో. మనీకి, మగువకు లొంగిపోయే బలహీన వ్యక్తులను ఎంచుకుని వాళ్ల నుంచి సమాచారం సేకరిస్తోంది. జ్యోతి మల్హోత్రా లాంటి హడావుడి చేసే వాళ్లే కాదు.. సైలెంట్‌గా పని పూర్తిచేస్తున్న స్లీపర్ సెల్స్ కూడా ఉన్నాయి. అలాంటి వాళ్లందరినీ వెతికి మరీ ఏరిపారేస్తోంది భారత నిఘా వ్యవస్థ. పంజాబ్‌కు చెందిన గగన్‌దీప్ సింగ్ అలా దొరికిపోయినవాడే. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నట్టు పక్కా ఇన్ఫర్మేషన్ ఉండడంతో పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో.. బార్డర్‌లో భారత సైన్యం కదలికలకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్ ఐఎస్‌ఐకి చేరవేశాడు గగన్‌దీప్ సింగ్. కొన్నేళ్లుగా.. సరిహద్దు ప్రాంతాల్లో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ను దేశం దాటిస్తున్నాడు. ఈ దేశద్రోహి ఐదేళ్లుగా పాకిస్తాన్‌లో ఉంటున్న గోపాల్ చావ్లాతో టచ్‌లో ఉన్నాడు. ఈ గోపాల్ చావ్లా.. ఓ ఖలిస్తానీ ఉగ్రవాది. భారత్‌పై విద్వేశాన్ని వెల్లగక్కుతుంటాడు. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌తోనూ సంబంధాలున్నాయి. చావ్లా ద్వారా ఐఎస్‌ఐ గూఢచారులతో గగన్ పరిచయం పెంచుకున్నాడు. గగన్‌దీప్ మొబైల్‌ను చెక్ చేస్తే.. అందులో 20 మందికి పైగా ఐఎస్‌ఐ కాంటాక్ట్‌లు ఉన్నాయి. అంతేకాదు.. అతని ఫోన్‌లో భారత భద్రతా వ్యవస్థలకు సంబంధించిన సమాచారం కూడా ఉంది. పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన చర్యలకు సంబంధించిన కీలక సమాచారం కూడా ఆ ఫోన్‌లో ఉంది. ఇక రాజస్తాన్‌లో మరో దేశద్రోహిని అరెస్ట్ చేశారు. జైసల్మేర్‌కు...




