సీఎం ఇంటికి బాంబు థ్రెట్.. యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

బెదిరింపుతో భద్రతను పెంచారు అధికారులు. చెన్నై రోడ్డులో ఉన్న సీఎం పళనిస్వామి నివాసానికి, మెరీనా తీరంలో కామరాజర్ సాలైలో ఉన్న సచివాలయానికి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అయితే ఫోన్ చేసిన యువకుడిని అరెస్ట్...

సీఎం ఇంటికి బాంబు థ్రెట్.. యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Follow us

| Edited By:

Updated on: Jun 04, 2020 | 9:03 AM

తమిళనాడు సీఎం పళనిస్వామి ఇంటికి, సెక్రటేరియట్‌కి బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే కదా. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. బెదిరింపుతో భద్రతను పెంచారు అధికారులు. చెన్నై రోడ్డులో ఉన్న సీఎం పళనిస్వామి నివాసానికి, మెరీనా తీరంలో కామరాజర్ సాలైలో ఉన్న సచివాలయానికి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అయితే ఫోన్ చేసిన యువకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.

విల్లుపురం జిల్లా మరకాణం ప్రాంతానికి చెందిన భువనేశ్వర్‌(25)గా గుర్తించారు పోలీసులు. ఎగ్మూరులోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి, గ్రీన్‌వేస్ రోడ్డులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం, సచివాలయంలో బాంబులు పెట్టానని.. అవి త్వరలోనే పేలుతాయని చెప్పి వెంటనే లైన్ కట్ చేశాడు.

బెదిరింపు కాల్స్‌తో పోలీసులు అప్రమత్తమయ్యారు. సెక్రటేరియట్‌ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. వెంటనే బాంబ్, డాగ్‌స్క్వాడ్‌లు రంగంలోకి దిగాయి. సచివాలయంలోని అన్ని మార్గాల్ని తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసు అధికారులు. అయితే అది ఉత్తుత్తి బెదిరింపేనని నిర్థారించారు. ఫోన్ నెంబర్ ఆధారంగా కాల్ చేసిన యువకుడిని అరెస్ట్ చేశారు. ఈ యువకుడు గతంలో కూడా పుదుచ్ఛేరి ముఖ్యమంత్రికి కూడా బాంబు బెదిరింపులు చేసి అరెస్ట్ అయ్యాడని పోలీసుల విచారణలో తేలింది.