Goa Elections 2022: మీ చేతగానితనంతో మోడీ బలపడుతున్నారు.. కాంగ్రెస్ పార్టీపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

| Edited By: Anil kumar poka

Dec 23, 2021 | 6:29 PM

Goa Assembly Elections: రాజకీయాలను కాంగ్రెస్ సీరియస్‌గా పరిగణించడం లేదని తృణమూల్ కాంగ్రెస్ (TMC) చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.

Goa Elections 2022: మీ చేతగానితనంతో మోడీ బలపడుతున్నారు.. కాంగ్రెస్ పార్టీపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
Mamata Banerjee
Follow us on

Goa Elections 2022: రాజకీయాలను కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకోవడం లేదని తృణమూల్ కాంగ్రెస్ (TMC) చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. కాంగ్రెస్ చేతగానితనం కారణంగానే ప్రధాని నరేంద్ర మోడీ మరింత శక్తివంతమవుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ బరిలో నిలుస్తుండటం తెలిసిందే. అక్కడ మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.  జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షం(కాంగ్రెస్) సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం చెందుతోందని..దీని కారణంగా ఇతరులు ఇబ్బందులు పడుతున్నారని మమత వ్యాఖ్యానించారు. త్రిపుర, గోవా, మేఘాలయతో పాటు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఎంసీ పోటీచేసే అంశాన్ని టీఎంసీ పరిశీలిస్తున్నట్లు ఆమె తెలిపారు. కాంగ్రెస్‌కు పెద్ద సమస్య రాహుల్ గాంధీయేనంటూ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. తాజాగా మమతా బెనర్జీ కూడా అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు.

గతంలో ప్రధాని మోడీపై పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం దొరికిందని మమతా బెనర్జీ అన్నారు. అయితే బీజేపీపై పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ.. తనకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో పోటీ చేసిందని ఆరోపించారు. తమ రాష్ట్రంలో ఢిల్లీ దాదాగిరీ చాలా జరిగిందన్న మమతా బెనర్జీ.. ఇక ఢిల్లీ దాదాగిరిని సహించేది లేదని హెచ్చరించారు. ప్రాంతీయ పార్టీలు బలోపేతం కావాలని.. అలాగే దేశ సమాఖ్య వ్యవస్థ బలోపేతంకావాలని అన్నారు. రాష్ట్రాలు బలోపేతం కావాలన్న ఆమె.. రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం కూడా బలంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.

గోవా అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ.. అక్కడి 40 అసెంబ్లీ స్థానాల్లోనూ టీఎంసీ పోటీ చేస్తుందని మమతా బెనర్జీ ప్రకటించారు.  గోవాలో టీఎంసీ కోసం ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని IPAC కూడా పనిచేస్తోంది. గోవా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టెన్నీస్ దిగ్గజం లియాండర్ పేస్.. మమతా బెనర్జీ సమక్షంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Also Read..

Onion: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు.. అలా అని అధికంగా తింటే..

Viral Video: గాలిలో ఎగురుతున్న అమ్మాయి.. ఎలా సాధ్యం..? వీడియో