AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sadhguru: యోగాతోనే వాటిని అధిగమించగలం.. ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా శిబిరాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా యోగా శిబిరాలను నిర్వహించారు. 10,000 మందికి పైగా రక్షణ సిబ్బందికి ఉచిత యోగా సెషన్‌లను నిర్వహించడంతోపాటు.. ఆరోగ్యం గురించి అవగాహన కల్పించారు. శిక్షణ పొందిన యోగా వీరుల నేతృత్వంలో దేశం అంతటా ఇషా 2,500 ఉచిత యోగా సెషన్‌లను నిర్వహించారు.

Sadhguru: యోగాతోనే వాటిని అధిగమించగలం.. ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా శిబిరాలు
Sadhguru
Shaik Madar Saheb
|

Updated on: Jun 21, 2025 | 4:03 PM

Share

యోగా స్వేచ్ఛను ఇచ్చే వ్యవస్థ.. అని.. శారీరక, మానసిక శ్రేయస్సు కోసం యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని సద్గురు జగ్గీ వాసుదేవ్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఎక్స్‌లో కీలక ట్వీట్ షేర్ చేశారు. యోగా అనేది మీకు చేతన ఎంపిక జీవితాన్ని, బలవంతపు ఆలోచన.. చర్యలకు బానిస కాని జీవితాన్ని సృష్టించుకునే విధంగా స్వేచ్ఛను ఇచ్చే వ్యవస్థ.. అంటూ పేర్కొన్నారు. మీరు చేతనంగా మారడం ద్వారా బలవంతపుతనాన్ని అధిగమించగలిగినప్పుడే మీ శారీరక, మానసిక శ్రేయస్సును మీరు పూర్తిగా నిర్ణయించగలరు.. అంటూ సద్గురు జగ్గీ వాసుదేవ్ పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ యోగా డే.. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అంటూ సద్గురు హ్యాష్‌ట్యాగ్ చేశారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా యోగా శిబిరాలను నిర్వహించారు. 10,000 మందికి పైగా రక్షణ సిబ్బందికి ఉచిత యోగా సెషన్‌లను నిర్వహించడంతోపాటు.. ఆరోగ్యం గురించి అవగాహన కల్పించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా.. 11వేల మందికి పైగా శిక్షణ పొందిన యోగా వీరుల నేతృత్వంలో భారతదేశం అంతటా ఇషా 2,500+ ఉచిత యోగా సెషన్‌లను నిర్వహించారు.

బెంగళూరులోని సద్గురు సన్నిధిలో నిర్వహించిన యోగా దినోత్సవంలో భారత త్రివిధ దళాలకు చెందిన 5,000 మందికి పైగా రక్షణ సిబ్బంది పాల్గొన్నారు.. అలాగే సమీప సమాజాల నుంచి దాదాపు వేయి మందింకి పైగా పౌరులు పాల్గొన్నారు.

రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో నిర్వహించిన యోగా శిబిరంలో దాదాపు 1,500 మంది రక్షణ సిబ్బంది పాల్గొన్నారు. జోధ్‌పూర్ ఎయిర్‌బేస్‌లో జరిగిన యోగా సెషన్‌లో 900 మంది ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..