AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన మన దేశంలోనే.. త్వరలోనే ప్రారంభం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి త్వరలోనే జమ్ము కశ్మీర్ లో ప్రారంభం కానుంది. చెనబ్ నదిపై దాదాపు 359 మీటర్లు అంటే 1,178 ఫీట్ల ఎత్తులో.. బక్కాల్, కౌరి ప్రాంతాల మధ్య ఈ వంతెనను నిర్మించారు.

ప్రపంచలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన మన దేశంలోనే.. త్వరలోనే ప్రారంభం
Railway Bridge
Aravind B
|

Updated on: Mar 26, 2023 | 11:05 AM

Share

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి త్వరలోనే జమ్ము కశ్మీర్ లో ప్రారంభం కానుంది. చెనబ్ నదిపై దాదాపు 359 మీటర్లు అంటే 1,178 ఫీట్ల ఎత్తులో.. బక్కాల్, కౌరి ప్రాంతాల మధ్య ఈ వంతెనను నిర్మించారు. ప్యారీస్ లో ఉన్న ఈఫిల్ టవర్ కంటే ఈ వంతెన ఎత్తు 35 మీటర్లు ఎక్కవ. ఉదంపూర్, శ్రీనగర్, బరముల్లా ప్రాంతాల రైల్వై అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా దాదాపు రూ.35 వేల కోట్లతో దీన్ని నిర్మించారు. ఇటీవలే ఈ వంతెన హై వెలాసిటీ విండ్, హై టెంపరేచర్, స్థిరత్వం, భద్రత లాంటి పరీక్షలన్నింటినీ క్లీయర్ చేసింది. ఇప్పుడు దాదాపు అన్ని పనులు పూర్తి కావస్తుండటంతో తొందర్లోనే ఈ వంతెనపై రైళ్లు పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నాయి.

వాస్తవానికి ఈ వంతెన నిర్మించేందుకు 2003లోనే అనుమతి వచ్చింది. 2004 లో పనులు పారంభమయ్యాయి. కానీ 2008లో ఆ వంతెన స్థిరత్వం, భద్రత పట్ల అనుమానాలు, భయాలు రావడంతో కొంతకాలం పాటు ఆపేశారు. ఆ తర్వాత మళ్లీ ప్రారంభించారు. కానీ అనేక సవాళ్లు ఎదురుకావడం వల్ల పనులు నెమ్మదిగా సాగాయి. జమ్ము కశ్మీర్ ప్రజలు దాదాపు 20 ఏళ్ల నుంచి ఈ వంతెన కోసం ఎదురుచూస్తున్నారు. చివరికీ ఇప్పుడు అన్ని పనలు పూర్తి కావడంతో తొందర్లోనే ఈ వంతెనను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. తాజాగా ఆ వంతెనను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పరిశీలించారు. ఈ వంతెనపై రేపు ఇంకో రెండు పరీక్షలు నిర్వహించాల్సి ఉందని… అవి పూర్తైతే తొందర్లోనే ఈ వంతెన ప్రారంభిస్తామని వెల్లడించారు. అయితే ఈ వంతెన దాదాపు 260 kmph వేగంతో వచ్చే గాలిని కూడా తట్టుకుంటుందని.. దాదాపు 120 ఏళ్ల పాటు ఈ బ్రిడ్జి స్థిరంగా ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Follow Us
న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు!
న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు!
పిల్లలకు డయేరియా, వాంతులా? ORS తాగిస్తే నయం అవుతుందా..
పిల్లలకు డయేరియా, వాంతులా? ORS తాగిస్తే నయం అవుతుందా..
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే