Richa Chadha: గాల్వాన్‌పై నటి రిచా చడ్డా చేసిన ట్వీట్‌పై సెలబ్రిటీల మధ్య వార్‌.. కీలక కామెంట్స్ చేసిన నగ్మా, ప్రకాష్ రాజ్..

గాల్వాన్‌పై నటి రిచా చద్దా చేసిన ట్వీట్‌పై సెలబ్రిటీల మధ్య వార్‌ మరింత ముదరింది. సైనికులను అవమానించారని, ఇది తగదని చాలామంది రిచాను టార్గెట్‌ చేస్తుండగా..

Richa Chadha: గాల్వాన్‌పై నటి రిచా చడ్డా చేసిన ట్వీట్‌పై సెలబ్రిటీల మధ్య వార్‌.. కీలక కామెంట్స్ చేసిన నగ్మా, ప్రకాష్ రాజ్..
Nagma

Updated on: Nov 26, 2022 | 1:13 PM

గాల్వాన్‌పై నటి రిచా చద్దా చేసిన ట్వీట్‌పై సెలబ్రిటీల మధ్య వార్‌ మరింత ముదరింది. సైనికులను అవమానించారని, ఇది తగదని చాలామంది రిచాను టార్గెట్‌ చేస్తుండగా.. ఆమెకు మద్దతిచ్చే వాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది.

భారత సైనికుల త్యాగాల్లే మనమంతా దేశంలో క్షేమంగా ఉన్నామని, సైన్యాన్ని కించపర్చే విధంగా వ్యాఖ్యలు చేయడం తగదని అక్షయ్‌కుమార్‌ ట్వీట్‌ చేశారు. రిచా కామెంట్స్‌ తనను చాలా బాధపెట్టాయన్నారు. అయితే అక్షయ్‌కుమార్‌ ట్వీట్‌కు కౌంటరిచ్చారు నటుడు ప్రకాశ్‌రాజ్‌. దేశానికి రిచా చద్దా లాంటి వాళ్లు కావాలని మీలాంటి వ్యక్తుల అవసరం లేదని ఆయన ట్వీట్‌ చేశారు. రిచా చద్దాకు సీక్వెల్‌గా నిలిచారు నటి, కాంగ్రెస్‌ నేత నగ్మా. పీఓకే కోసం సైన్యం సిద్ధంగా ఉంటే, బీజేపీ ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోంది? రిచా చద్దా గాల్వాన్‌పై చేసిన ట్వీట్‌కు రీట్వీట్‌ చేశారు నగ్మ. అయితే, తాను చద్దాకు మద్ధతు ఇవ్వడం లేదంటూ కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

POK ను స్వాధీనం చేసుకుంటామని భారత ఆర్మీ నార్తన్‌ కమాండ్‌ కొద్దిరోజుల క్రితం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ ఆదేశాల కోసం తాము ఎదురు చూస్తున్నామని స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. ఈ ప్రకటనను చులకన చేసేలా బాలీవుడ్ నటి రిచా చద్దా ట్వీట్ చేసింది. POK పై దాడి చేస్తే మరో గాల్వాన్‌ అనుభవం ఎదురవుతుందని ఆమె నార్తన్‌ కమాండ్‌ స్టేట్‌మెంట్‌ను గేలి చేసే విధంగా ట్వీట్‌ చేశారు. దీనిపై ఆర్మీ అధికారులు, బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. సైన్యాన్ని అవమానించడం కొందరు సెలబ్రిటీలకు అలవాటుగా మారిందన్నారు. పబ్లిసిటీ కోసం వాళ్లు చేసే వ్యాఖ్యలను పట్టించుకోవద్దు, భారత సైన్యం సత్తాను చూసి దేశం గర్విస్తోందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..