Ramdev Baba On Women Dress: దుస్తులు లేకుండా కూడా ఆడవాళ్లు అందగత్తెలే.. తీవ్ర దుమారం రేపుతున్న రాందేవ్ బాబా కామెంట్స్..
రామ్ దేవ్ బాబా చిక్కుల్లో ఇరుక్కున్నారు. మహిళల వస్త్రధారణపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. అమృతా ఫడణవిస్ ముందే రామ్‌దేవ్‌బాబా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
రామ్ దేవ్ బాబా చిక్కుల్లో ఇరుక్కున్నారు. మహిళల వస్త్రధారణపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ భార్య అమృతా ఫడణవిస్ ముందే రామ్‌దేవ్‌బాబా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. థానేలోని పతంజలి యోగా పీఠం, ముంబయి మహిళల పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో యోగా సైన్స్ కార్యక్రమాన్ని నిర్వహించాయి. దీనికి ముఖ్య అతిథిగా అమృతా ఫడణవిస్ హాజరయ్యారు. మహిళలకు ఏర్పాటు చేసిన యోగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ముగిసిన వెంటనే సమావేశం జరిగింది. వెంట వెంటనే పలు కార్యక్రమాలు నిర్వహించడం వల్ల శిబిరానికి వచ్చిన మహిళలకు డ్రెస్ చేంజ్ చేసుకునే సమయం దొరకలేదు. దీంతో వారి డ్రెస్సింగ్ సెన్స్ పై రాందేవ్ బాబా షాకింగ్ కామెంట్సు చేశారు. మహిళలు చీరలు ధరించేందుకు సమయం లేకపోవడం వల్ల సల్వార్ సూట్స్‌లో బాగుంటారని.. అంతే కాకుండా తన కంటికైతే మహిళలు ఏం ధరించకోపోయినా బాగుంటారని చెప్పడం తీవ్ర దూమారం రేపింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన పలువురు.. రామ్‌దేవ్‌బాబాపై మండిపడుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..