AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్త కనిపించడం లేదంటూ కన్నీళ్లు.. కట్‌చేస్తే.. బాత్రూం టైల్స్ కింద మైండ్ బ్లాంక్ అయ్యే సీన్..

భర్త కనిపించడంలేదంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె మాటలు నమ్మి బంధువులు, పోలీసులు 45 రోజుల పాటు ఊరంతా వెతికారు. ఎక్కడా దొరకలేదు. తన భర్త ఎప్పటికైనా తిరిగి వస్తాడంటూ ఆమె అందరి ముందు కన్నీళ్లు పెట్టుకుంది. కానీ ఓ రోజు ఇంట్లో తనిఖీలు చేపట్టిన పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యే సీన్ కనిపించింది.

భర్త కనిపించడం లేదంటూ కన్నీళ్లు.. కట్‌చేస్తే.. బాత్రూం టైల్స్ కింద మైండ్ బ్లాంక్ అయ్యే సీన్..
Woman Kills Husband In Agra
Krishna S
|

Updated on: Jul 04, 2026 | 10:19 AM

Share

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో ఓ భార్య చేసిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. కనిపించకుండా పోయాడంటూ 45 రోజుల పాటు తన భర్త కోసం బంధువులతో కలిసి వెతికిన ఓ మహిళ, చివరికి తానే అతడిని హతమార్చి శవాన్ని బాత్రూం టైల్స్ కింద పూడ్చిపెట్టిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆగ్రాకు చెందిన సురేంద్ర కుమార్ శర్మ అనే వ్యక్తి గత మే 18న నుండి కనిపించకుండా పోయాడు. భర్త ఎక్కడికో వెళ్లాడని, త్వరలోనే తిరిగి వస్తాడంటూ అతడి భార్య రూబీ బంధువులను, చుట్టుపక్కల వారిని నమ్మిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే మే 26న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. బంధువులు, పోలీసులు ఎంత వెతికినా సురేంద్ర జాడ దొరకకపోవడంతో ఈ అదృశ్యం కాస్తా పెద్ద మిస్టరీగా మారింది.

పోలీసుల తనిఖీతో వీడిన గుట్టు

మరో పాత కేసుకు సంబంధించిన వెరిఫికేషన్ కోసం శుక్రవారం పోలీసులు సురేంద్ర ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో భార్య రూబీ ప్రవర్తన పోలీసులకు తీవ్ర అనుమానాస్పదంగా అనిపించింది. అదే సమయంలో సురేంద్ర సోదరుడు అనిల్ శర్మ పోలీసులకు కొన్ని కీలక విషయాలు వెల్లడించడంతో అధికారులు ఇల్లంతా క్షుణ్ణంగా సోదా చేయడం ప్రారంభించారు. ఈ తనిఖీల్లో భాగంగా బాత్రూంలోకి వెళ్లిన పోలీసులకు అక్కడ కొత్తగా వేసిన టైల్స్, ప్లాస్టరింగ్ ప్రత్యేకంగా ఆకర్షించాయి. ఏదో దాచారనే అనుమానంతో పోలీసులు ఆ టైల్స్ తొలగించి, బాత్రూం లోపల తవ్వకాలు జరపగా.. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న సురేంద్ర మృతదేహం బయటపడింది. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

పక్కా ప్లాన్‌తోనే హత్య.. భార్య అరెస్ట్

ప్రాథమిక విచారణ ప్రకారం.. సురేంద్రను హత్య చేసిన వెంటనే శవాన్ని బాత్రూంలోనే పూడ్చిపెట్టినట్లు తెలిసింది. నేరానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఉండేందుకు శవంపై మట్టి పోసి, పైన ప్లాస్టరింగ్ చేసి కొత్త టైల్స్ పరిచారు. పోలీసుల విచారణలో రూబీ తన నేరాన్ని అంగీకరించింది. అయితే ఈ హత్య చేయడానికి ముందే ఆమె బాత్రూం రినోవేషన్ పని కోసం మేస్త్రీ, కూలీలను మాట్లాడి ఉంచుకోవడం గమనార్హం.

కుటుంబ కలహాలే కారణమా?

సురేంద్ర సోదరుడు అనిల్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు సురేంద్రకు రెగ్యులర్‌గా మద్యం తాగే అలవాటు ఉండేది. దీనివల్ల భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. బహుశా ఈ కారణంతోనే హత్య జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలం నుండి కీలక ఆధారాలు సేకరించింది. నిందితురాలైన రూబీని ఇప్పటికే కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దారుణ హత్య వెనుక ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా? ఈ కుట్రలో ఆమెకు ఎవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us
డైమండ్ కట్ డిజైన్​తో అదిరిపోయే స్మార్ట్‌వాచ్. స్పెషాలిటీస్ ఇవే
డైమండ్ కట్ డిజైన్​తో అదిరిపోయే స్మార్ట్‌వాచ్. స్పెషాలిటీస్ ఇవే
జుర్రుకుని తినేలా కమ్మని పాలకూర కర్రీ.. 
జుర్రుకుని తినేలా కమ్మని పాలకూర కర్రీ.. 
ఖైరతాబాద్‌లో 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతి.. ఈసారి ప్రత్యేకత..
ఖైరతాబాద్‌లో 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతి.. ఈసారి ప్రత్యేకత..
కమ్మని కొత్తిమీర కొబ్బరి పచ్చడి.. రుచి చూస్తే వదిలిపెట్టరు!
కమ్మని కొత్తిమీర కొబ్బరి పచ్చడి.. రుచి చూస్తే వదిలిపెట్టరు!
టెక్ ప్రియులను ఆకట్టుకుంటున్న ఏథర్​ కోనార్క్‌ ఆటోపాప్ ఫీచర్
టెక్ ప్రియులను ఆకట్టుకుంటున్న ఏథర్​ కోనార్క్‌ ఆటోపాప్ ఫీచర్
కూరలు చేసే టైమ్ లేదా? క్షణాల్లో ఇలా 'టమాటో రైస్' చేయండి..
కూరలు చేసే టైమ్ లేదా? క్షణాల్లో ఇలా 'టమాటో రైస్' చేయండి..
సుమలత బహిరంగ క్షమాపణలు చెప్పాలి : శేఖర్ మాస్టర్
సుమలత బహిరంగ క్షమాపణలు చెప్పాలి : శేఖర్ మాస్టర్
90s కిడ్స్ ఫేవరెట్ కార్టూన్ నెట్‌వర్క్ క్లాసిక్ షోలు..
90s కిడ్స్ ఫేవరెట్ కార్టూన్ నెట్‌వర్క్ క్లాసిక్ షోలు..
ఇది కొత్త ఆధ్యాయం..బిగ్‌బాస్ తెలుగు 10 ఎంట్రీపై హింట్ ఇచ్చేశాడుగా
ఇది కొత్త ఆధ్యాయం..బిగ్‌బాస్ తెలుగు 10 ఎంట్రీపై హింట్ ఇచ్చేశాడుగా
అమెరికా ప్రభుత్వ పథకంలో మోసం.. పంజాబ్ లో దొరికాడు!
అమెరికా ప్రభుత్వ పథకంలో మోసం.. పంజాబ్ లో దొరికాడు!