AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చిరుతను చెడుగుడు ఆడుకున్న బామ్మ.. చేతికర్రతో దుమ్ముదులిపేసింది..

ఏ పొదల్లోంచి ప్రమాదం ముంచుకొస్తుందో ? ఎటువైపు నుంచి మృత్యువు దాడి చేస్తుందో ? అని హడలిపోతున్నారు ముంబైవాసులు. చిరుత సంచారం..

Viral Video: చిరుతను చెడుగుడు ఆడుకున్న బామ్మ.. చేతికర్రతో దుమ్ముదులిపేసింది..
Leopard
Sanjay Kasula
|

Updated on: Sep 30, 2021 | 12:46 PM

Share

ఏ పొదల్లోంచి ప్రమాదం ముంచుకొస్తుందో ? ఎటువైపు నుంచి మృత్యువు దాడి చేస్తుందో ? అని హడలిపోతున్నారు ముంబైవాసులు. చిరుత సంచారం.. ఆ ప్రాంతంలో జనానికి కంటి మీద కరువైన కనుకులేకుండా చేస్తోంది. ఇది.. ఒక్కో రోజు, రెండు రోజులు కాదు.. ఏకంగా రెండేళ్లు. ఎప్పుడు ఎక్కడ కనిపిస్తుందో తెలియదు. ఎటు వైపు నుంచి దాడి చేస్తుందో తెలియదు. జనం అనేక మార్లు ఫిర్యాదులు.. దాన్ని పట్టుకునేందుకు సిబ్బంది కూడా ప్రయత్నిస్తున్నారు. ఇలా మూడు రోజుల్లోనే రెండవ సారి దాడి చేసింది.

ముంబైలోని ఆరే కాలనీలో 64 ఏళ్ల మహిళపై చిరుత దాడి చేసింది. చిరుత దాడిలో మహిళ గాయపడి ఆసుపత్రిలో పొందుతున్నారు. కానీ గాయపడకముందు ఆ మహిళ చేసిన సహసాన్ని స్థానికులతోపాటు నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. చిరుత పులి పేరు చెబితేనే వ‌ణుకుతో పరుగులు పెడతాం. అలాంటి చిరుత ఓ వృద్ధురాలిపై దాడి చేయ‌బోగా ఆమె చాకచ‌క్యంతో దాన్ని త‌ప్పించుకుంది. కేవలం చేతి కర్ర సహాయంతో తరిమివేసింది. చిరుతనే పరుగులు పెట్టించింది. ఈ ప్రాంతంలో చిరుత దాడి చేయడం  గత 15 రోజుల్లో ఇది ఆరోసారి.

ఈ సంఘటన బుధవారం రాత్రి 8 గంటల సమయంలో గోరేగావ్ (తూర్పు) లోని ఆరే కాలనీ సీఈఓ కార్యాలయం సమీపంలో జరిగింది. 64 ఏళ్ల వృద్ధురాలు తన ఇంటి వెలుపల వరండాలో కూర్చుని ఉంది. అదే సమయంలో  అకస్మాత్తుగా వెనుక నుండి చిరుత దాడి చేసింది. దాడి చేసిన వెంటనే రియక్ట్ అయ్యింది వృద్ధురాలి. తన చేతి కర్రను చిరుతపులి నోటిపై కొట్టింది. ఆ మహిళ దాడి చేస్తుండటంతో వెంటనే పారిపోయింది చిరుత. చిరుత ఆరుపులతో చుట్టు పక్కల ఉండే జనం బయటకు వచ్చారు. ఈ దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మహిళ  స్వల్పంగా గాయపడింది. చిరుత దాడిలో గాయ‌ప‌డిన ఆమెను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. నిర్మ‌లా దేవీ ముఖం, కాలికి స్వ‌ల్ప గాయాల‌య్యాయి. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు. ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

చిరుతపులి వృద్ధురాలిపై దాడి చేసిన వీడియోను ఇక్కడ చూడండి..

రాత్రిపూట పోలీసు పెట్రోలింగ్  

ఆరే కాలనీ ప్రక్కనే బోరివలి నేషనల్ పార్క్ ఉంది. అక్కడ చిరుతలు తరచుగా నివాస ప్రాంతాల్లోకి వస్తుంటాయి. జాతీయ ఉద్యానవనానికి దగ్గరగా ఉన్నందున ఆరే కాలనీ జనాభా ఎక్కవగా కనిపించదు. రాత్రి సమయంలో ఈ ప్రాంతం పూర్తిగా నిర్మానుష్యంగా కనిపిస్తుంది. రాత్రి వేళల్లో పోలీసు పెట్రోలింగ్ పెంచాలని  స్థానిక ప్రజల డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: IPL srh vs csk Match Prediction: చెన్నైతో సై అంటే సై.. విజయోత్సాహంతో దూకుడుమీదున్న హైదరాబాద్

Skin Care: మీ ముఖం మీద అవాంఛిత పుట్టుమచ్చలు ఉన్నాయా.. వాటిని తొలిగించుకునేందుకు ఇంట్లోనే ఇలా చేయండి..

సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..