Woman Dance: ఇష్టమైన పాట వినిపిస్తే అంతేమరి.. పరిసరాలతో పనిలేదు.. డ్యాన్స్ చేయాలనిపిస్తుంది అంతే..

వైరల్‌  అవుతున్న ఈ వీడియో కోల్‌కతాలో షూట్ చేసినట్లు తెలుస్తోంది. 1982 లో బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా డిస్కో డాన్సర్ లోని సూపర్ హిట్ సాంగ్  "యాద్ రహా హై తేరా ప్యార్"  అనే సాంగ్ కు ఒక మహిళ ఓ రేంజ్ లో డ్యాన్స్ చేస్తోంది.

Woman Dance: ఇష్టమైన పాట వినిపిస్తే అంతేమరి.. పరిసరాలతో పనిలేదు.. డ్యాన్స్ చేయాలనిపిస్తుంది అంతే..
Woman Dace Video
Follow us

|

Updated on: Oct 30, 2022 | 6:11 PM

సోషల్ మీడియాలో ఆసక్తికరమైన,  ఫన్నీ వీడియోలు నెటిజన్లను ఆకర్షిస్తూ ఉంటాయి. తమకు నచ్చితే చాలు వాటిని వైరల్ చేస్తూ సందడి చేస్తారు. అవి  మిమ్మల్ని అంతగా అలరిస్తాయి మరి. అందుకనే తాము చేసిన వీడియోలను ఎక్కువమందికి షేర్ చేస్తూ.. తమతో పాటు ఇతరులతో కూడా తమ ఆనందాన్ని పంచుకుంటారు. ఒక్కసారి భారీ సినిమాలోని సన్నివేశాలు కూడా చేయని పని ఒక చిన్న రీల్ చేస్తుంది. చిన్న చిన్న రీల్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయి.  అలాంటి వీడియో ఒకటి  ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.ఇది చూస్తే మీరు కూడా హర్షం వ్యక్తం చేస్తారు. వైరల్‌  అవుతున్న ఈ వీడియో కోల్‌కతాలో షూట్ చేసినట్లు తెలుస్తోంది. 1982 లో బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా డిస్కో డాన్సర్ లోని సూపర్ హిట్ సాంగ్  “యాద్ రహా హై తేరా ప్యార్”  అనే సాంగ్ కు ఒక మహిళ ఓ రేంజ్ లో డ్యాన్స్ చేస్తోంది. దుర్గాపూజ మండపం వెలుపల ఒక మహిళ నిలబడి ఉంది.. అంతేకాదు.. ఆ సాంగ్ కు డ్యాన్స్ చేస్తున్న ఈ మహిళ తన స్టెప్స్ తో అక్కడ ఉన్న వారిని ఆకట్టుకుంది.  ఆమె డ్యాన్స్ ను చూస్తూ కళ్లు తిప్పుకోలేకపోయారు.

ఇక్కడ వీడియో చూడండి

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో.. కోల్‌కతా వీధుల్లో మిథున్ చక్రవర్తి  ఐకానిక్ పాటకు హృదయపూర్వకంగా నృత్యం చేస్తున్న మహిళను మీరు చూడవచ్చు. ఆమె పూజా మండపం బయట ఉంది. పాట వింటూనే ఆమె మనసు స్పదించింది. కాళ్లు నాట్యం చేయమని చెప్పినట్లు ఉన్నాయి. ఆమె డ్యాన్స్ చేస్తున్న విధానం ఖచ్చితంగా చూడదగినది అనిపిస్తోంది.

ఈ వీడియోను తానియా మైత్రా అనే ఖాతా ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. ఈ వీడియోను రెండు లక్షల మందికి పైగా చూడగా, 2.5 వేల మందికి పైగా లైక్ చేసారు. చాలా మంది ఫన్నీ కామెంట్స్  చేశారు. ఈ స్థలం ఎక్కడ ఉంది అని చాలా మంది అడిగారు. అదే సమయంలో, ఒక వినియోగదారు మాట్లాడుతూ, నైపుణ్యం ఉంటే.. దుస్తులు పట్టింపు లేదని ఇది రుజువు చేస్తుందన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles