AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parliament Winter Session: విపక్ష సభ్యుల నిరసనల మధ్య పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నిరవధిక వాయిదా

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు షెడ్యూల్‌ కంటే ముందే ముగిశాయి. విపక్షాల ఆందోళన కారణంగా పార్లమెంట్‌ సమావేశాలు రెండు రోజుల ముందే వాయిదా పడ్డాయి.

Parliament Winter Session: విపక్ష సభ్యుల నిరసనల మధ్య పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నిరవధిక వాయిదా
Parliament
Balaraju Goud
|

Updated on: Dec 22, 2021 | 4:02 PM

Share

Winter Session of Parliament adjourned: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు షెడ్యూల్‌ కంటే ముందే ముగిశాయి. విపక్షాల ఆందోళన కారణంగా పార్లమెంట్‌ సమావేశాలు రెండు రోజుల ముందే వాయిదా పడ్డాయి. లఖీంపూర్‌ ఖేరి హింసాకాండలో కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా రాజీనామాకు పట్టుబడుతూ విపక్షాలు తమ ఆందోళన కొనసాగించాయి. లోక్‌సభ 82 శాతం పనిచేసిందని కేంద్రం తెలిపింది. అటు రాజ్యసభలో మాత్రమే ఎక్కవ సమయం వృథా అయినట్టు వివరణ ఇచ్చింది. ఈ సమావేశాల్లో 11 బిల్లులను లోక్‌సభ , 9 బిల్లలును రాజ్యసభ ఆమోదించింది. ఆరు బిల్లులను స్టాండింగ్‌ కమిటీకి పంపించారు. 12 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్‌పై కూడా కేంద్రం వెనక్కి తగ్గలేదు. దీంతో ఉభయసభల్లో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. ముఖ్యంగా ఈ సమావేశాల్లో వ్యవసాయ సాగు చట్టాల రద్దు బిల్లుకు ఆమోదముద్ర పడింది.

అయితే, పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరిగిన తీరుపై రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సభా సమయం చాలా వృధా అయ్యిందని , ఇలా ఎందుకు జరిగిందో సభ్యులు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు వెంకయ్యనాయుడు. అయితే కేంద్రం వాదనలను విపక్షాలు తిప్పికొట్టాయి. చాలా బిల్లులను ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించారని కాంగ్రెస్‌ ఎంపీలు ఆరోపించారు. పార్లమెంట్‌ లోని గాంధీ విగ్రహం దగ్గర సమావేశాల చివరి రోజు కూడా విపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు. రాజ్యాంగం పీఠికను చదువుతూ హక్కులు కాపాడాలని నినాదాలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే 13 మంది ఎంపీలను సస్పెండ్‌ చేశారని రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లిఖార్జున్‌ ఖర్గే ఆరోపించారు. అధికధరలతో పాటు నిరుద్యోగం ,ఇతర సమస్యలపై చర్చించేందుకు తాము నోటీసులు ఇచ్చినప్పటికి పట్టించుకోలేదన్నారు. వర్షాకాల సమావేశాల్లో జరిగిన ఘటనకు బాధ్యులను చేస్తూ 12 మంది రాజ్యసభ ఎంపీలను శీతాకాల సమావేశాల్లో సస్పెండ్‌ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

మరోవైపు, పార్లమెంటు శీతాకాల సమావేశాలు విజయవంతమయ్యాయని కేంద్రం ప్రకటించింది. అయితే విపక్షాలు మాత్రం పెదవి విరిచాయి. ఉభయసభల్లో ఎలాంటి చర్చ లేకుండానే హడావిడిగా బిల్లులు ఆమోదించారని, ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర అంశాలపై చర్చించాలని తాము కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రతిపక్ష నేతలు పేర్కొన్నారు. షెడ్యూల్ తేదీ కంటే ఒకరోజు ముందుగా బుధవారంనాడు పార్లమెంటు సమావేశాలు నిరవధింగా వాయిదా పడ్డాయి. అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి మీడియాతో మాట్లాడుతూ, నవంబర్ 29తో మొదలైన సమావేశాలు ఇవాల్టితో ముగిసాయని చెప్పారు. 24 రోజుల్లో 18 సిట్టింగ్స్ జరిగాయన్నారు. లోక్‌సభలో 82 శాతం, రాజ్యసభలో 47 శాతం సభాకార్యక్రమాలు నిర్వహించినట్టు చెప్పారు. రాజ్యసభలో 9, లోక్‌సభలో 11 బిల్లులు ఆమోదం పొందినట్టు తెలిపారు. నవంబర్ 28న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని, ధరల పెరుగుదలపై ప్రధానంగా చర్చించాలని సమావేశం నిర్ణయించిందని మంత్రి చెప్పారు. దీనిపై చర్చకు ఆర్థిక మంత్రి సిద్ధంగా ఉన్నప్పటికీ చర్చ చోటుచేసుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఎన్నికల చట్టాలకు స్పల్పంగా మార్పులు చేశామని, డెరిక్ ఒబ్రెయిన్ (టీఎంసీ ఎంపీ) సభలో ఎలా ప్రవర్తించారో అందరూ చూశారని అన్నారు.

Read Also…  UPSC CDS I 2022: 341 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన యూపీఎస్‌సీ.. పూర్తి వివరాలు..