Wife and Husband: వివాహేతర సంబంధాలు వేద మంత్రాల సాక్షిగా జరిగిన వివాహ బంధాలను తెంచేస్తున్నాయి. మనుషులను క్రూరంగా మారుస్తున్నాయి. కట్టుకున్న వారినే క్రూరంగా హతమార్చే స్థాయికి వ్యక్తులను దిగజారుస్తున్నాయి. తాజాగా ఇందుకు నిదర్శనమైన ఘటన హర్యానాలోని ఫరీదాబాద్‌లో చోటు చేసుకుంది. ప్రియుడిపై మోజులో తన భర్తకు అన్నంలో మత్తు మందు పెట్టిన ఆ భార్య.. అతను మత్తులోకి జారుకోగానే ప్రియుడితో కలిసి విచక్షణారహితంగా దాడి చేసింది. అతడు చనిపోయాడని భావించి ఇంట్లో సొమ్మంతా కాజేసి ప్రియుడితో కలిసి పారిపోయింది. అయితే, ఇప్పుడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. చనిపోయాడనుకున్న భర్త తిరిగిరావడంతో అమ్మగారి కథ అడ్డం తిరిగి మెడకు ఉచ్చు బిగుసుకుంది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫరీదాబాద్‌కు చెందిన దంపతులు.. కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇద్దరి మధ్య గత కొంత కాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఇక భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ ఘర్షణల నేపథ్యంలో తన భర్తను అంతమొందించాలని ప్రియుడితో కలిసి పథకం వేసింది భార్య. ఈ క్రమంలోనే జనవరి 17-18 మధ్య రాత్రి తన భర్త తినే అన్నంలో మత్తు మందు కలిపింది. భర్త మైకంలోకి జారుకోగానే.. భార్య తన ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి భర్తపై దాడి చేసింది. ముగ్గురూ కలిసి బాధిత వ్యక్తిని విచక్షణా రహితంగా కొట్టారు. ఆ దెబ్బలకు అతను చనిపోయాడని భావించి.. ఇంట్లో ఉన్న నగదు, నగలు, ఇతర విలువైన వస్తువులతో ప్రియుడితో కలిసి పారిపోయింది. అయితే, చనిపోయాడనుకున్న బాధితుడు మరుసటి రోజు ఉదయం లేచి చూడగా ఇంట్లో భార్య సహా, విలువైన వస్తువులేవీ కనిపించలేదు. దాంతో బాధితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Also read:
Textile: చీరలపై ఐ లవ్ యూ అని ముద్రణ.. వస్త్ర వ్యాపారులపై ప్రజల ఆగ్రహం! చివరికి ఏమైందంటే..
Hyderabad:హైదరాబాద్ పోలీసుల గొప్ప మనసు.. గ్రీన్ ఛానెల్ ద్వారా గుండె, ఊపిరితిత్తుల తరలింపు
Keerthy Suresh: జోరుమీదున్న కీర్తిసురేష్.. యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసిన ముద్దుగుమ్మ..