Wife and Husband: తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నవవధువు నిండా నెలరోజులు కూడా గడవకుండానే ఆత్మహత్య చేసుకుంది. అత్తా గారింట్లో టాయిలెట్ లేదనే కారణంతో బలవంతగా ప్రాణాలు తీసుకుంది. దీంతో ఇరు కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపించారు.
కడలూరు జిల్లా అరిసిపెరియంకుప్పం గ్రామానికి చెందిన రమ్య, ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఈ క్రమంలోనే స్థానికంగా ఉంటున్న కార్తీకేయన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి ప్రేమను ఇరువురి కుటుంబ పెద్దలు అంగీకరించారు. ఏప్రిల్ 6న కార్తికేయతో వివాహం జరిగింది. అత్తింటికి చేరిన రమ్య తన భర్త ఇంట్లో మరుగుదొడ్డి లేని కారణంగా టాయిలెట్ ఉన్న ఇంటికి మారిపోదామని భర్తను పదేపదే కోరింది. అయినా అతడు మాట వినకపోవటంతో..ఇదే వారి మధ్య గొడవకు దారితీసింది. కార్తీకేయన్ రమ్యపై చేయిచేసుకున్నట్గుగా తెలిసింది. దాంతో మనస్తాపానికి గురైన రమ్య..ఆమె పుట్టింటికి చేరింది. తల్లితోనే కలిసి ఉంటోంది.
ఈ క్రమంలోనే మే 11న ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు రమ్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా గమనించిన తల్లి.. కూతురుని హుటా హుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. అయినా ఫలితం లేకపోయింది. రమ్య తల్లిఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.