నిర్భయ దోషులకు ఉరి మళ్ళీ వాయిదా పడుతుందా ?

నిర్భయ కేసు దోషులను ఫిబ్రవరి 1 న ఉరి తీయకపోవచ్ఛుననే వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఈ నెల 22 న ఈ నలుగురు దోషులను ఉరి తీయవలసి ఉండగా.. లీగల్ కారణాల వల్ల ఫిబ్రవరి 1 కి వాయిదా పడింది. ఈ నలుగురిలో ఇద్దరు లీగల్ ఆప్షన్స్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఒకరి క్యురేటివ్ పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేయగా.. మరొకడి మెర్సీ పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించారు. ముకేష్ కుమార్ సింగ్, వినయ్ శర్మ అనే […]

నిర్భయ దోషులకు ఉరి మళ్ళీ వాయిదా పడుతుందా ?
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 22, 2020 | 7:00 PM

నిర్భయ కేసు దోషులను ఫిబ్రవరి 1 న ఉరి తీయకపోవచ్ఛుననే వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఈ నెల 22 న ఈ నలుగురు దోషులను ఉరి తీయవలసి ఉండగా.. లీగల్ కారణాల వల్ల ఫిబ్రవరి 1 కి వాయిదా పడింది. ఈ నలుగురిలో ఇద్దరు లీగల్ ఆప్షన్స్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఒకరి క్యురేటివ్ పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేయగా.. మరొకడి మెర్సీ పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించారు. ముకేష్ కుమార్ సింగ్, వినయ్ శర్మ అనే ఈ ఇద్దరి లీగల్ ఆప్షన్స్ మూసుకుపోయాయి. వినయ్ శర్మ కేసు ఇంకా వివాదంలో కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది.. గత ఏడాది ఇతని పేరిట ఓ మెర్సీ పిటిషన్ రాష్ట్రపతి వద్దకు చేరింది. దీని విషయంలో జరుగుతున్న జాప్యంపై సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వచ్చాయి. అయితే తానేమీ అలాంటి పిటిషన్ పంపలేదని వినయ్ శర్మ పేర్కొన్నాడు. ఇది తీహార్ జైలు అధికారుల కుట్ర అని ఆరోపించాడు. పైగా రాష్ట్రపతికి ఓ లేఖ కూడా రాశాడు. ఆ లేఖతో బాటు ఆ పిటిషన్ కూడా రాష్ట్రపతి వద్ద పెండింగులో ఉన్నట్టు చెబుతున్నారు. ఇక మరో ఇద్దరు దోషులు పవన్ గుప్తా, అక్షయ్ కుమార్ సింగ్ క్యురేటివ్ పిటిషన్లు దాఖలు చేయలేదు.  అయితే ఈ పిటిషన్లను వేస్తామని వీరి తరఫు లాయర్లు చెబుతున్నారు. న్యాయ ప్రక్రియను జాప్యం చేసేందుకు వీరు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయవచ్చునని తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే ఫిబ్రవరి ఒకటో తేదీన ఈ దోషులను ఉరి తీయకపోవచ్ఛునని అంటున్నారు. తాజాగా డెత్ వారెంట్ జారీ చేయాలంటే రెండు సుప్రీంకోర్టు తీర్పులు, తీహార్ జైలు మాన్యువల్ లీగల్ కారణాలుగా కనిపిస్తున్నాయి.

2014 లో శత్రుఘన్ చౌహాన్ కేసులో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ప్రకటించింది. ఒక దోషి  మెర్సీ పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించినప్పటినుంచి 14 రోజుల కాలపరిమితి ముగిసే ముందే అతడిని ఉరి తీయజాలరన్నదే ఆ తీర్పు సారాంశం. తీహార్ జైలు నిబంధనలు కూడా ఇందుకు అనుగుణంగానే ఉన్నాయి. అలాగే 1982 లో హర్ బన్ష్ సింగ్ వర్సెస్ యూపీ స్టేట్ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఇఛ్చిన తీర్పును కూడా కొందరు ఉదహరిస్తున్నారు. ఒక నేరం జరిగినప్పుడు ఆ ఘటనకు కారకులైన దోషులను వేర్వేరుగా ఉరి తీయజాలరని, రాష్ట్రపతి వద్ద పెండింగులో మరేవైనా క్షమాభిక్ష పిటిషన్లు పెండింగులో ఉన్నాయా.. సుప్రీంకోర్టు తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల పరిణామాలు వంటివాటిని పరిశీలించవలసి ఉంటుందని నాడు కోర్టు అభిప్రాయపడింది.