ఇండియాకు ఇస్తున్నాం 10 వేల ఎలెక్ట్రిక్ రిక్షాలు.. జెఫ్ బెజోస్
క్లైమేట్ ఛేంజ్ ను ఎదుర్కొనేందుకు ఇండియాకు తాము 10 వేల ఎలెక్ట్రిక్ రిక్షాలను అందజేస్తామని అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ప్రకటించారు. వీటిని లాంచ్ చేసిన ఆయన.. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘ హే ఇండియా ! వుయ్ ఆర్ రోలింగ్ ఔట్ న్యూ ఫ్లీట్ ఆఫ్ ఎలెక్ట్రిక్ డెలివరీ రిక్షాస్.. జీరో కార్బన్.. క్లైమేట్ ప్లెడ్జ్ ‘ అని కూడా అన్నారు. కాలుష్యాన్ని వెదజల్లని ఇలాంటి సుమారు లక్ష […]
క్లైమేట్ ఛేంజ్ ను ఎదుర్కొనేందుకు ఇండియాకు తాము 10 వేల ఎలెక్ట్రిక్ రిక్షాలను అందజేస్తామని అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ప్రకటించారు. వీటిని లాంచ్ చేసిన ఆయన.. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘ హే ఇండియా ! వుయ్ ఆర్ రోలింగ్ ఔట్ న్యూ ఫ్లీట్ ఆఫ్ ఎలెక్ట్రిక్ డెలివరీ రిక్షాస్.. జీరో కార్బన్.. క్లైమేట్ ప్లెడ్జ్ ‘ అని కూడా అన్నారు. కాలుష్యాన్ని వెదజల్లని ఇలాంటి సుమారు లక్ష వాహనాలను మరికొన్నేళ్లలో వీధుల్లో తిప్పాలన్నది ఆయన లక్ష్యమట. ఇవి 40 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ బయటకు రాకుండా నిరోధించగలుగుతాయని జెఫ్ భావిస్తున్నారు. తమ సంస్థ తయారు చేసిన ఈ ఎలెక్ట్రిక్ రిక్షాల తాలూకు వీడియోను రిలీజ్ చేసిన ఆయన.. ఇండియాను పొగడ్తలతో ముంచెత్తారు. 21 వ శతాబ్దం ఇండియన్ సెంచరీ అవుతుందని, 2025 సంవత్సరానికి భారతీయ ఎగుమతులు 10 బిలియన్ డాలర్ల మేర పెరగడానికి తమ సంస్థ తోడ్పడుతుందని అన్నారు.
జెఫ్ బెజోస్ సంస్థ తయారు చేసిన ఎలెక్ట్రిక్ వాహనాల్లో మూడు, నాలుగు చక్రాల మోడల్స్ ఉన్నాయి. ఈ రెండు డిజైన్ల వాహనాలను ఇండియాలోనే తయారు చేయడం విశేషం. కార్బన్ కాలుష్యాలను ఇవి చాలావరకు తగ్గిస్తాయని అమెజాన్ కంపెనీ భావిస్తోంది. గత కొన్నేళ్లలో భారత దేశంలో ఎలెక్ట్రిక్ మొబైలిటీ ఇండస్ట్రీ పురోగతి సాధించిందని, దీనివల్ల టెక్నాలజీ మరింతగా పుంజుకోగలిగిందని అమెజాన్ అభిప్రాయపడింది. తాము తయారు చేసిన ఎలెక్ట్రిక్ రిక్షాలు ఈ ఏడాది ఇండియాలో ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, పూణే, నాగపూర్, కోయంబత్తూరు సహా మొత్తం 20 నగరాల్లో ప్రవేశిస్తాయని ఈ సంస్థ పేర్కొంది. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చునని తెలిపింది.
కాగా … జెఫ్ బెజోస్.. ఇటీవలే ఇండియాను తన గర్ల్ ఫ్రెండ్ లారెన్ సాంచెజ్‌తో సహా విజిట్ చేశారు. భారతీయ కుర్తాను ధరించి మహాత్ముని సమాధి వద్ద ఆయనకు నివాళులు అర్పించారు. అలాగే ఆగ్రాను, ముంబైని కూడా సందర్శించారు. ముంబైలో కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలతో భేటీ అయ్యారు. ఇలా ఇండియాతో ఆయన తన సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు.