Cough Syrup: 66 మంది పిల్లలు మృతి.. ఈ కంపెనీ తయారు చేసే నాలుగు దగ్గు, జలుబు సిరప్ లు వాడొద్దని WHO హెచ్చరిక

|

Oct 07, 2022 | 7:22 AM

ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్, టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ, భారతదేశానికి చెందిన ప్రముఖ ఫ్యార్మా కంపెనీ లిమిటెడ్ తయారు చేసిన దగ్గు మరియు జలుబు సిరప్‌లను పరీక్షించిన నాలుగు ఉత్పత్తుల నమూనాలు ఉన్నాయని చెప్పారు.

Cough Syrup: 66 మంది పిల్లలు మృతి.. ఈ కంపెనీ తయారు చేసే నాలుగు దగ్గు, జలుబు సిరప్ లు వాడొద్దని WHO హెచ్చరిక
Cough And Cold Syrup
Follow us on

భారతదేశంలోని ప్రముఖ కంపెనీ తయారు చేసే దగ్గు మరియు జలుబు సిరప్‌ల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం హెచ్చరిక జారీ చేసింది. గాంబియాలో 66 మంది మరణించిన తర్వాత ఈ హెచ్చరిక జారీ చేయబడింది. WHO తన వైద్య ఉత్పత్తుల ప్రయోగశాల పరీక్షలలో, ఈ సంస్థ  ఉత్పత్తులైన దగ్గు, జలుబు సిరప్‌లలో అధిక మొత్తంలో డైథైలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ కనుగొనబడ్డాయని పేర్కొంది. అవి పిల్లలకు హెల్త్ కు మంచివి కావని.. పిల్లలలో ఈ సిరప్‌లు మూత్రపిండాలను పాడుచేస్తున్నాయని, ఇతర సమస్యలకు దారితీస్తున్నాయని తెలిపింది.

దీనితో, WHO తన నివేదికలో ఈ ఉత్పత్తి గురించి హెచ్చరిక జారీ చేసింది. వివాదాస్పద ఉత్పత్తులు గాంబియాలో ఇప్పటివరకు కనుగొనబడ్డాయి. ఇప్పుడు దీనిని ఇతర దేశాలలో కూడా పంపిణీ చేయవచ్చు. కనుక ఈ విషయంలో భారత ప్రభుత్వం అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్, టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ, భారతదేశానికి చెందిన ప్రముఖ ఫ్యార్మా కంపెనీ లిమిటెడ్ తయారు చేసిన దగ్గు మరియు జలుబు సిరప్‌లను పరీక్షించిన నాలుగు ఉత్పత్తుల నమూనాలు ఉన్నాయని చెప్పారు. ఈ కంపెనీకి చెందిన దగ్గు, బలుబు సిరప్ లు మానవులకు విషపూరితమైనవి అని తెలిపింది. రోగులకు మరింత హాని కలిగించకుండా నిరోధించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాల్లో ఇటువంటి ఉత్పత్తులను గుర్తించి, తొలగించాలని సిఫార్సు చేసింది. గాంబియాలోని ఉత్పత్తుల్లో వీటిని గుర్తించామని, ఇతర దేశాలకు కూడా ఇవి పంపిణీ చేసి ఉండొచ్చని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.

గత నెలలో అంటే సెప్టెంబర్‌లో గాంబియాలో 60 మంది పిల్లలు మరణించారు. ఈ చిన్నారులు తాగిన దగ్గు సిరప్  వలనే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని.. ముఖ్యంగా చిన్నారుల్లో కిడ్నీ సమస్య తెరపైకి వచ్చిందని తెలుస్తోంది. చిన్నారుల మరణాలకు గల కారణాలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. అయితే భారత్‌కు చెందిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO), డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI), భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి ఇప్పటి వరకు ఈ విషయంపై ఎటువంటి ప్రకటన వెలువడలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..